YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

విద్య, ఆదాయం, ఔషధాలు, వ్యవసాయంఫై ప్రత్యెక దృష్తి : ప్రధాని మోదీ

విద్య, ఆదాయం, ఔషధాలు, వ్యవసాయంఫై ప్రత్యెక దృష్తి : ప్రధాని మోదీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:    

తమ ప్రభుత్వం ప్రధానంగా 5 అంశాలపై దృష్టి పెట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మంగళవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన సొంత నియోజక వర్గం వారణాసిలో పర్యటిస్తున్న ఆయన.. సంత్‌ రవిదాస్‌ ఆస్థాన్‌ వద్ద నిర్వహించిన ఓ కార్యక్రమంలో పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘ఎన్డీఏ ప్రభుత్వం పంచధర్మాలపై దృష్టిపెట్టింది. విద్య, ఆదాయం, ఔషధాలు, వ్యవసాయంతో పాటు సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు సేకరించి పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. కుల, మత, వర్గ విభేదాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం అందరికీ తమ పథకాల ప్రయోజనాలను అందిస్తోంది. కుల వివక్ష ఉండకూడదని గురూజీ సంత్‌ రవిదాస్‌ సందేశమిచ్చారు. సమాజంలో ఇప్పటికీ కుల వివక్ష ఉన్నంత కాలం సామాజిక సామరస్యం, సమానత్వాలను సాధించలేము’ అని వ్యాఖ్యానించారు.‘సొంత ప్రయోజనాల కోసం కులవివక్షను సృష్టిస్తూ, దాన్ని వ్యాప్తి చేస్తున్న వారిని గుర్తించండి. న్యూ ఇండియాలో భాగంగా యువత సాయంతో కుల వివక్షలేని సమాజాన్ని సాధిద్దాం. నాలుగున్నరేళ్లుగా మేము సబ్‌‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ అనే నినాదంతో పనిచేస్తున్నాం. నిజాయతీయే మన సంతోషానికి కారణంగా నిలుస్తుంది. మేము ఈ సిద్ధాంతాన్ని పాటించే ప్రయత్నం చేస్తున్నాం. ఎలాగోలా బతేకేద్దాంలే.. అన్న మనస్తత్వం ప్రజల్లో ఉంది. ఇందులో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. సమాజంలోని అన్ని వర్గాల వారికి ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతోంది. పేదవారికి విద్యుత్తు‌, గ్యాస్‌ కనెక్షన్లు, రూ.5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పిస్తోంది. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తోంది. రైతులకు ప్రతి ఏడాది రూ.6,000 అందించాలని నిర్ణయం తీసుకున్నాం. అవినీతిరహిత పాలన అందుతోంది. నిజాయతీగా ఉండేవారికి ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోంది’ అని మోదీ వ్యాఖ్యానించారు.

Related Posts