యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతికి అడ్డగా మారిందని, డ్రామా రాజకీయాలే తప్ప అభివృద్ధి లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో 2500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆ డబ్బును ప్రజలకు ఎప్పుడు చెల్లిస్తారో సమాధానం చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదని హెచ్చరించారు. టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న వలసలే ఇందుకు నిదర్శనమన్నారు.