యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
1983 అంటే టీడీపీ ఆవిర్భావం నుంచి 2009వరకు కూడా నర్సరావుపేట నుంచి 7 సార్లు పోటీ చేసి ఐదుసార్లు గెలిచి..రెండు సార్లు ఓడిపోయిన కోడెల శివప్రసాద్‌రావు 2014 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి సత్తెనపల్లి నియోజకవర్గానికి మారారు. ఇక్కడ సమీప ప్రత్యర్థి అయిన అంబటి రాంబాబుపై 713ఓట్ల స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. అనుకున్నట్లుగానే ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు స్పీకర్ హోదా కట్టబెట్టి గౌరవించారు. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కొనసాగుతున్న అతికొద్దిమంది సీనియర్ నేతల్లో ఆయన ఒకరు. అందుకే చంద్రబాబు ఆయన్ని గౌరవిస్తారనే టాక్ ఉంది. స్పీకర్ హోదాలో ఆయన నియోజకవర్గానికి భారీగానే నిధులు తెచ్చారని చెప్పాలి. దాదాపు రూ.1000కోట్లు అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేసినట్లుగా ఆయన ప్రచారం చేసుకుంటున్నారు.కార్యకర్తలతో కలసి పనిచేయకపోవడం..నియోజకవర్గానికి దూరంగా ఉండటం వంటి అంశాలు ఆయనకు మైనస్ మార్కులు పడేలా చేస్తున్నాయి. అలాగే అదే సమయంలో ఆయన చేసిన పనుల్లో జనాలకు ఉపయోగపడటం కన్నా ఆయన..ఆయన కొడుకు అవినీతే ఎక్కువగా ఉందనే ఆరోపణలున్నాయి. వారు చేసిన అవినీతి, అక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయంటూ అంబటి వర్గం నేతలు ధీమాతో ఉన్నారు. ఈసారి ఆరు నూరైనా నూరు ఆరైనా…వైసీపీ జెండాను నియోజకవర్గంపై ఎగురవేస్తామని అంబటి రాంబాబు బల్లగుద్ధి మరీ చెబుతుండటం విశేషం. గత ఎన్నికల్లోనే అంబటి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈ సారి తనకు భారీ మెజార్టీ తప్పదన్న ధీమాతో ఆయన ఉన్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోటీ తప్పదని తేలిపోయింది. జనసేన..టీడీపీ..వైసీపీ ఇలా మూడు పార్టీలు సమ ఉజ్జీలుగా కనబడుతున్నాయి.తే వైసీపీ నుంచి అంబటి రాంబాబు కూడా కాపు సామాజిక వర్గం నాయకుడే కావడం..రెడ్డి సామాజిక వర్గం నేతలు ఆయనపై గుర్రుగా ఉండటం వంటి అంశాలు ఓవరాల్‌గా టీడీపీకి కలసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ఇక జనసేన కూడా గంపెడాలు పెట్టుకున్న సామాజిక వర్గం ఓట్లలో కూడా రెండు పార్టీల నేతలు చీల్చే అవకాశం ఉంది. అయితే ఇదే పార్టీ టికెట్ ఆశిస్తున్న దిలీప్ అంచనాలకు మించి జనంలో దూసుకెళ్లిపోతుండటం కూడా కొంత ఆలోచింపజేస్తోంది. ఇక కోడెల నర్సరావుపేటకు వెళ్తరాన్న ప్రచారం జరుగుతుండగా కాసు మహేష్‌రెడ్డి టీడీపీలోకి వస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే కాసు మహేష్‌రెడ్డిని అధిష్ఠానం నర్సరావుపేట నుంచి పోటీ చేయించాలని చూస్తోందని..అలా జరిగితే స్పీకర్ మళ్లీ ఇక్కడి నుంచే బరిలోకి దిగాల్సిందేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదేమైనా ఇటు స్పీకర్ కోడెలపై కొడుకు ఎఫెక్ట్‌తో వ్యతిరేకత, అంబటిని రెడ్లు వ్యతిరేకిస్తుండడం, జనసేన నుంచి కాపు వర్గం ఓట్లు చీలడం లాంటి అంశాలు ఎన్నికల్లో కీలకం కానున్నాయి.