Highlights
- హౌస్ ఆన్ వీల్స్
- అదో సరదా..
- అమెరికా,
- కెనడాలో 70 వేల కిలోమీటర్లు ప్రయాణం
ప్రయాణ సమయంలో చాలా మంది విలాసాల కంటే అవసరాలకే ప్రాధాన్యత ఇస్తారు. పక్కా బడ్జెట్ ప్లానింగ్ తో ఈ పనిచేస్తారు. విదేశాల్లో చాలా మందికి వీలైనన్ని కొత్త ప్రాంతాలను సందర్శించటం ఇష్టం. వాళ్ళు సేవింగ్స్ కంటే ప్రయాణాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో ఏ మాత్రం రాజీపడరు. అమెరికాకు చెందిన ఓ జంట ప్రస్తుతం అదే పనిచేస్తోంది. అమెరికాలో తమకున్న ఆస్తులన్నింటిని అమ్మేసి..గత మూడేళ్ళుగా ‘హౌస్ ఆన్ వీల్స్’పై తమ జర్నీని కొనసాగిస్తున్నారు. ఇఫ్పటికే వీరు అమెరికా, కెనడాలో 70 వేల కిలోమీటర్లు ప్రయాణించారు. దీని కోసం 130 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన హౌస్ ఆన్ వీల్స్ ను సిద్ధం చేసుకున్నారు. ఇందులోనే క్రిస్ట్రిన్ పార్సన్స్, అలెక్సిస్ స్టీఫెన్స్ ప్రయాణిస్తున్నారు.
ఈ హౌస్ ఆన్ వీల్స్ లో బెడ్ రూమ్ తోపాటు కిచెన్, తమ కుమారుడికి అవసరమైన సౌకర్యాలు, బాత్ రూమ్, కుర్చీలు వేసుకుని కూర్చునే వెసులుబాటు చేసుకున్నారు. అలెక్సిస్ గతంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేయగా..క్రిస్ట్రిన్ ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్.తమ జర్నీలో మార్గమధ్యంలో జరిగే పలు సమావేశాల్లో కూడా వీళ్లు పాల్గొంటున్నారు. ఇలా సాహసాలు చేసే జంటలు అమెరికాలో ఎన్నో. అలా కాకుండా కూడా ఉద్యోగాలు చేసుకునే వారు కూడా ప్రతి ఏటా టార్గెట్ పెట్టుకుని పలు దేశాలు చుట్టివస్తారు. అలా తిరగటం వారికి సరదా