యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో: 'భారతీయుడు' సీక్వెల్ చేయడానికి ఇటీవలే శంకర్ రంగంలోకి దిగాడు. అయితే ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ తో శంకర్ కి మనస్పర్థలు రావడం వలన, ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. అయితే ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని లైకా ప్రొడక్షన్స్ అధికార ప్రతినిధి స్పష్టం చేసినట్టుగా తమిళ మీడియా చెబుతోంది.