యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైకాపా అధినేత జగన్ తో సినీ నటుడు నాగార్జున భేటీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. మంగళవారం నాడు వైఎస్ జగన్ ఇంటికి వెళ్లిన నాగార్జున ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అయన అననారు. బుధవారం అయన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ సినీ పరిశ్రమకు అండగా నిలబడివున్నామని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఇంటికి నిన్న వెళ్లిన టాలీవుడ్ హీరో నాగార్జున, ఆయనతో గంటపాటు భేటీ అవడాన్ని అయన నేరస్థులతో సినీ నటులు భేటీ కావడం దురదృష్టకరమని, ఇటువంటి భేటీలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం ఎంతో అండగా నిలబడుతోందని, అభివృద్ధికి అండగా అందరూ నిలవాల్సిన సమయంలో పరిశ్రమ ప్రముఖులు నేరగాళ్లతో కలవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. పనిచేస్తున్న వారికి దీవెనలు ఇవ్వాలని, వారికి మద్దతిచ్చి ప్రోత్సహించాలని సూచించారు. 019-24కు సమర్ధ బృందా న్ని ఎంపిక చేస్తున్నాం. కృష్ణా జిల్లా 2ఎంపి సీట్ల పరిధిలో 14మంది ఎమ్మెల్యేలతో భేటి అయ్యాను ప్రజలతో మమేకం అయ్యారు,కృష్ణా జిల్లా పార్టీలో ఇబ్బందులు లేవు. అభ్యర్ధుల ఎంపికకు ప్రజాభిప్రాయమే ప్రామాణికం. బూత్ నుంచి రాష్ట్రస్థాయి వరకు పకడ్బందీగా పార్టీ నిర్మాణం వుంటుంది. అన్నిస్థాయిల్లో నేతపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాం. ప్రత్యక్ష ఎన్నికల్లో కొందరికి అవకాశం రాదు. అలాంటివారికి నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యమని అన్నారు. సానుకూల దృక్ఫథమే టిడిపి మూలసూత్రం. ప్రతికూల స్వభావానికి(నెగటివిటి) టిడిపిలో స్థానం లేదు.
వైసిపి తప్పుడు సర్వేలు చేస్తోంది,చేయిస్తోంది రాజకీయ లబ్ది కోసమే వైసిపి తప్పుడు సర్వేలని అన్నారు. ఇతరులు సర్వేచేస్తే వైసిపి అడ్డుకుంటోంది. సర్వేలు చేయనివ్వకుండా అడ్డంకులు పెడుతోంది. వైసిపి తప్పుడు సర్వేల గుట్టు బైటపడుద్దనే భయం. క్షేత్రస్థాయిలో వాస్తవిక సర్వేలంటే వైసిపికి భయం. బెదిరింపుల వల్లే టిడిపికి కొందరు దూరం అవుతున్నారని అన్నారు. బ్లాక్ మెయిలింగ్ చేసి టిడిపికి దూరం చేసే కుట్రలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఆస్తులును చూపించి బెదిరింపులు వస్తున్నాయి. తెలంగాణలో వ్యాపారాలకు అడ్డం ఉండదనే భరోసా. వైసిపిలో చేరితే హైదరాబాద్ లో వ్యాపారాలకు భరోసా ఆస్తులు కాపాడుకునేందుకే కొందరు వైసిపిలో చేరుతున్నారు. డబ్బు సంచుల కోసమే మోది,కెసిఆర్ తో జగన్ లాలూచిబిజెపి,టిఆర్ ఎస్ తో కుమ్మక్కై ఏపికి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. టిడిపి వస్తే 3పార్టీల ఆటలు సాగవు, కుట్రలు నెరవేరవని అన్నారు.