YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

బిగ్ బాస్' స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం..

Highlights

  • అగ్నికి బూడిదైన భారీ సెట్టింగులు
  • భారీ ఆస్థి నష్టం 
  • షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం 
బిగ్ బాస్' స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం..

బెంగుళూరులోని  బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ స్టూడియోలో  భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో భారీ సెట్టింగులు అగ్నికి ఆహుతయ్యాయి.. దీంతో అక్కడ ఉన్న కార్మికులు భయంతో పరుగులు తీశారు.. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి వచ్చారు.. ఈలోపే అక్కడ మంటలతో కాలిపోయి భారీ ఆస్థి నష్టం జరిగిపోయింది.. కాంక్రీటు వాడకుండా మౌల్డింగ్ విధానంలో నిర్మించిన తాత్కాలిక సెట్ కావడంతో ఏమీ మిగల్లేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Related Posts