యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కియా మోటార్స్ అధికారికంగా భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. డీలర్‌షిప్ నెట్‌వర్క్ ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరించింది. అందులో భాగంగానే కంపెనీ తొలి షోరూమ్‌ను ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ షోరూమ్ ఏర్పాటైంది. కియా మోటార్స్ ఎండీ, సీఈవో షిమ్ ఈ తొలి షోరూమ్‌ను ప్రారంభించారు. కియా మోటార్స్ తన తొలి డీలర్‌షిప్‌ను అలైడ్ మోటార్స్‌కు ఇచ్చింది. షోరూమ్ విషయానికి వస్తే.. ఇది 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైంది. చాలా అంతస్తులు ఉన్నాయి. కియా రెడ్ క్యూబ్ థీమ్‌తో ఇది నిర్మితమైంది. షోరూమ్‌పై కియా మోటార్స్ లోగో కనిపిస్తుంది. కియా తర్వాతి షోరూమ్‌లు కేరళలో ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం కియా మోటార్స్ నుంచి అలీసన్ గ్రూప్ డీలర్‌షిప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కియా మోటార్స్ నుంచి వస్తున్న తొలి కారు ఎస్‌పీ2ఐ ఎస్‌యూవీ. దీని తయారీ కూడా ప్రారంభమైంది. ఇందులో కియా గ్రిల్, 18 అంగుళాల అలాయ్ వీల్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. హెడ్స్ అప్ డిస్‌ప్లే, ఇన్‌కార్ వైఫై, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉండొచ్చు. ఇది పలు వేరియంట్ల రూపంలో అందుబాటులో ఉండనుంది. దీని ధర రూ.10 నుంచి రూ.16 లక్షలలోపు ఉండొచ్చు. అలాగే ఈ ఎస్‌యూవీ 1.5 లీటర్ పెట్రోల్, 1.5 డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో మార్కెట్‌లోకి రావొచ్చు.కాగా కియా ఎస్‌పీ2ఐకు రెనో క్యాప్చర్, నిస్సాన్ కిక్స్, హ్యుందాయ్ క్రెటా, జీప్ కాంపాస్, టాటా హరియర్ వంటి మోడళ్ల నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది