YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హెచ్ఐసీసీలో  బయో ఆసియా సదస్సు

Highlights

  • హైదరాబాద్ లో  మూడు రోజుల పాటు 
  • హాజరుకానున్న 60 దేశాల ప్రతినిధులు
  • బయో ఆసియా సదస్సుకు హైదరాబాద్ శాశ్వత వేదిక 
హెచ్ఐసీసీలో  బయో ఆసియా సదస్సు

 హైదరాబాద్ లో బయో ఆసియా -2018 సదస్సులు బుధవారం నుంచి మొదలవుతున్నాయి. హెచ్ఐసీసీలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 60 దేశాల నుంచి రెండు వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ‘ఇదే సరైన సమయం’ అనే నినాదంతో జీవశాస్త్రాలు, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడుల సమీకరణలు లక్ష్యంగా ఈ సదస్సును తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. 
తెలంగాణ ఔషధనగరి, సుల్తాన్ పూర్ వైద్య పరికరాల ఉత్పత్తి పార్కులలో పెట్టబడుల నిమిత్తం పలు సంస్థలతో అవగాహనా ఒప్పందాలను ప్రభుత్వం చేసుకోనుంది. కాగా, బయో ఆసియా సదస్సుకు హైదరాబాద్ శాశ్వత వేదికగా ఉంది. పద్నాలుగు సంవత్సరాలుగా ఈ సదస్సును హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు.

Related Posts