Highlights
- ఇప్పటి వరకు బుక్కైన 50మంది
- నకిలీల భరతం పడతాం
- ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రవీందర్
హైదరాబాద్ లో పోలీస్, ప్రెస్ అని స్టిక్కర్లు పెట్టుకుని తిరుగుతున్న నకిలీలపై పోలీసులు నిఘా విధించారు.
నకిలీ పోలీసులతో పాటు కొంతమంది విలేకరుల పేర్లు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు కంచన్‌బాగ్, గోషామహల్ పోలీస్ స్టేషన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి. పోలీసులు, విలేకరులమని చెప్పి అడ్డదారులు తొక్కుతున్నవారిని అడ్డంగా బుక్ చేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మెరుపు తనిఖీలు చేపట్టారు. నగరంలోని వివిధ కూడళ్లలో చెకింగ్‌లు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది దాదాపు 50మంది నకిలీలను గుర్తించారు. వాహనాలపై పోలీస్, ప్రెస్ అనే స్టిక్కర్లు తొలగించి వారికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రవీందర్ తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్ మరికొన్ని రోజులు నిర్వహించడంతో పాటు సడెన్‌గా కూడా చెకింగ్‌లు నిర్వహించి ఈ నకిలీల భరతం పడతామని ట్రాఫిక్ సీపీ అన్నారు.