YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాజమండ్రి కోసం తమ్ముళ్ల ఫైట్

 రాజమండ్రి కోసం తమ్ముళ్ల ఫైట్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:    

రాజమండ్రి సీటుపై తెలుగు తమ్ముళ్ళల్లో ఆధిపత్య పోరు తీవ్రమైంది. నిన్న మొన్నటి వరకు అంతర్గతంగా సాగిన ఈ పోరు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రోడ్డున పడే పరిస్థితి క్రమంగా పెరుగుతుంది. ఈ సీటును ఆశించే వారు క్రమంగా పెరుగుతుండటంతో అధిష్టానం తీసుకునే నిర్ణయం ఎలా వుండబోతుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతుంది. ఇప్పటికే ఐదుగురు వరకు టికెట్ ఆశిస్తున్నట్లు లెక్క తేలింది. నిన్న మొన్నటివరకు ఈ సీటులో తిరిగి పోటీ చేస్తారనుకున్న మాజీ మంత్రి రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే చిన్నన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి అర్బన్ కు దూరంగానే ఉంటారని అందుతున్న సమాచారంతో పోటీ మరింత పెరిగింది.బిసిలకు రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ సీటు కేటాయిస్తే తనకే అన్ని అర్హతలు ఉన్నాయని ఆర్యాపురం కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర రావు బల్లగుద్ది ప్రకటించేశారు. ఎన్ని రకాలుగా చూసినా తన తోడల్లుడు, ఎర్రన్నాయుడు వియ్యంకుడు ఆదిరెడ్డి అప్పారావు కన్నా అన్ని రకాల తానే బెటర్ అని చల్లా వెల్లడించారు. తన తండ్రి చల్లా శంకర రావు మునిసిపల్ వైస్ చైర్మన్ గా సేవలు అందించిన తీరు, 50 వేలమంది ఖాతాదారులున్న ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా తాను అందించిన సేవలకు 40 వేలమంది ఓటర్లు తనవెంటే ఉంటారని, ఇటీవల గోరంట్ల తో కలిసి వెళ్ళి అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ కి వివరించినట్లు తెలిపారు శంకరరావు. 2009 లో ప్రజారాజ్యం టికెట్ నుంచి పోటీ చేసి రౌతు సూర్యప్రకాశరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి పై కేవలం వేయి ఓట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగిందని ఈ వివరాలు ఇచ్చి టికెట్ కు దరఖాస్తు చేశానని చల్లా రధసప్తమి ముహూర్తం చూసుకు మరీ చెప్పేశారు.రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ టికెట్ రేసులో ఓసి నాయకుల్లో టికెట్ ఇస్తే గోదావరి అర్బన్ డెవలెప్ మెంట్ ఛైర్మెన్ గన్ని కృష్ణ ప్రధమ స్థానంలో వున్నారని చెప్పారు చల్లా శంకర రావు. ఇక కార్పొరేషన్ మేయర్ శ్రీమతి పంతం రజని శేష సాయి, శాప్ డైరెక్టర్ ఎర్ర వేణుగోపాల రాయుడు ఉన్నారని తెలిపారు ఆయన. బిసి కోటా లో ఇస్తే మాత్రం తానూ తన తోడల్లుడు ఆదిరెడ్డి అప్పారావు మాత్రమే ఉన్నామని అయితే ఆయన తనకన్నా పదిరోజులు ముందు మాత్రమే టిడిపిలో చేరారని తన నేపధ్యం ఈక్వేషన్లు చూసుకుని తనకే టికెట్ దక్కుతుందని భావిస్తున్నట్లు ధీమా వ్యక్తం చేశారు శంకర రావు.చివరి అవకాశం గా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నా అన్నారు చల్లా శంకర రావు. ఆదిరెడ్డి కి టికెట్ ఇచ్చినా, గన్ని కృష్ణ కు లేదా ఎవరికి టికెట్ ఇచ్చినా మాత్రం వారి విజయం కోసం పనిచేస్తా అంటున్నారు చల్లా. అధిష్టానం సర్వేలు ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని స్పష్టం చేసిందని చెప్పుకొచ్చారు ఆయన. ఇలా తన మనసులో మాట బయట పెట్టి టికెట్ల సమరానికి తెరతీసేశారు శంకర రావు. దాంతో ఇంతకాలం గుంభనంగా సాగిన ఈ వ్యవహారం రాజమండ్రి టిడిపిలో నువ్వానేనా అనే రీతిలో ఎన్నికల ముందు వరకు రసవత్తర రాజకీయాన్ని ఆవిష్కరించడం ఖాయంగా కనిపిస్తుంది. మరి అధినేత నిర్ణయం ఎవరికి మోదం ఎవరికి ఖేదం మిగులుతుందో చూడాలి.

Related Posts