YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా దేశీయం

రూ.2 కోట్లు కట్టిన నిర్మాతెవరు..?

Highlights

తెలుగు చిత్ర పరిశ్రమను తాకినా  జీఎస్టీ
ప్రముఖ నిర్మాతపై జీఎస్టీ కేసు 
రూ.7 కోట్లు పన్నుకు .రూ. రెండు కోట్లు చెల్లించిన నిర్మాత 
మిగిలిన రూ.5 కోట్ల చెల్లింపునకు వారం గడువు 
గడువు లోపు చెల్లించకుంటే నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌
సినీ నిర్మాత కార్యాలయాలపై సీజీఎస్టీ అధికారుల దాడులు
జులై నుంచి  జీఎస్టీ అమలు 

రూ.2 కోట్లు కట్టిన నిర్మాతెవరు..?

తెలుగు చిత్ర పరిశ్రమకు  జీఎస్టీ సెగ తాకింది.భారీ మొత్తంలో జీఎస్టీ వసూళ్లు చేసి ప్రభుత్వానికి జమ చేయకుండా సోతానికి వాడుకుంటున్న ఆ ప్రముఖ నిర్మాతెవరా అన్న చర్చ సినీరంగంలో వాడివేడిగా జరుగుతుంది. అందరి ఆలోచనల్లో ఓ నిర్మాత పేరు వస్తుంది.కానీ ఆ విషయాన్ని మాత్రం బయట పెట్టటానికి సాహసించండం లేదు. కానీ పరిశ్రమ యావత్తు ఫలానా అని కోడై కూస్తుంది. అసలు ఏం జరిగిందంటే..సినీ నిర్మాత కార్యాలయాలపై సీజీఎస్టీ అధికారుల దాడులు నిర్వహించారు. సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు ఐటీ దాడులనే చూశాం. ఇప్పుడు జీఎస్టీ వసూలు చేసి పన్ను జమచేయని నిర్మాతలపై సీజీఎస్టీ అధికారులు దాడులు చేయడం సినీ రంగంలో కలకలం రేపింది. సినీ రంగం సహా వివిధ రంగాల్లో భారీ మొత్తంలో పన్ను ఎగవేతదారులపై జీఎస్టీ అధికారులు దృష్టిసారించారు. నిర్మాతలు సినీ నిర్మాణానికి సంబంధించి నటీనటులు, టెక్నీషియన్స్‌ ,స్టూడియో, ల్యాబ్‌ల నుంచి చెల్లింపుల సమయంలో 12 శాతం పన్ను మినహాయించుకుంటారు. ఈ పన్నును జమచేయాల్సిన బాధ్యత నిర్మాతదే. ఆ డబ్బును ప్రభుత్వానికి జమచేయనందుకు ప్రముఖ తెలుగు నిర్మాతపై హైదరాబాద్‌ జీఎస్టీ కమిషనర్‌ కార్యాలయ అధికారులు కేసు నమోదు చేశారు. దక్షిణభారతదేశంలో ఈ తరహాలో నమోదైన మొదటి కేసు ఇదని సీజీఎస్టీ అధికారులు పేర్కొంటున్నారు. బుధవారం ఆ నిర్మాత కార్యాలయాలపై కేంద్ర జీఎస్టీ అధికారులు దాడులు చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రూ.ఏడు కోట్లు జీఎస్టీ వసూలు చేసి జమ చేయనట్లు గుర్తించారు. పన్ను బకాయిల్లో నిర్మాత బుధవారమే రూ.రెండు కోట్లు చెల్లించగా మిగిలిన రూ.ఐదుకోట్ల చెల్లింపునకు వారం రోజుల గడువు కోరారు. వారం రోజుల్లో చెల్లించకుంటే నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ సహా తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని జీఎస్టీ అధికారులు హెచ్చరించారు.


జీఎస్టీ అమల్లోకి వచ్చిన జులై నుంచి నిర్మాత తీసిన సినిమాలకు సంబంధించి వివిధ విభాగాల నుంచి చెల్లింపుల సమయంలో జీఎస్టీ మినహాయించుకున్నారు. వారం రోజులుగా దీనిపై దృష్టిసారించిన అధికారులు పన్ను వసూలు చేసి జమచేయకపోవడాన్ని ఆధారాలతో సహా గుర్తించి దాడులు చేశారు. ఈ నిర్మాత జీఎస్టీకి సంబంధించి దాఖలు చేసిన రిటర్న్‌లు, పన్ను చెల్లింపు వివరాలను సమగ్రంగా పరిశీలించనున్నట్లు సీజీఎస్టీ అధికారులు వివరించారు.  పన్నుకు జరిమానా విధించడంతో బాటు వ్యక్తిగతంగా కూడా పన్ను మొత్తమెంతో అంత జరిమానా విధించేందుకు జీఎస్టీ చట్టంలో అవకాశం ఉంది. ఈ చట్టం మేరకు ఐదేళ్లవరకూ జైలు శిక్ష విధించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

Related Posts