యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కర్నూలు:
స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను తయారు చేసి రూపొందించడమే తమ కర్తవ్యమని జిల్లా కలెక్టర్ యస్. సత్యనారాయణ వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులతో అన్నారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలపై వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బోగస్ ఓటర్లు లేకుండా స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందిస్తామన్నారు. ఈ నెల 23,24 తేదీలలో జిల్లాలోని బూత్ స్ధాయి స్పెషల్ క్యాంపైన్ నిర్వహిస్తామన్నారు. అక్కడికి వెళ్లి ఓటర్ల జాబితాను పరిశీలించి ఓటుహక్కు లేకుంటే ఓటరుగా నమెదె చేయించుకోవచ్చన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఒక పోలింగ్ బూత్ లో 1200 మంది కన్నా అలాగే పట్టణ ప్రాంత పోలింగ్ బూత్ లో 1400 మంది కన్నా ఎక్కువ ఓటర్లు వున్నట్లయితే అదనపు పోలింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తామన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఒక సెట్ ఓటర్ల జాబితాను ఉచితంగా ఇస్తామని అదనపు సెట్ల్ కొరకు చలానా కడితే ఇస్తామని అన్నారు. జాయింట్ కలెక్టర్ రవి పటాన్ శెట్టి మాట్లాడుతూ ఈ నెలలో జరిగే స్పెషల్ క్యాంపైన్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే 1950 నెంబర్ కు పోన్ చేసి ఓటర్ల నమెదు వివరాలను తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ ఓ వెంకటేశం, నగరపాలక సంస్థ కమీషనర్ ప్రశాంతి, కర్నూలు, నంద్యాల ఆర్ డిఓలు వెంకటేశ్వర్లు, నారాయణమ్మ, బిజెపి తరపున నాగేంద్ర, టిడిపి తిరుపతయ్య, వైయస్ ఆర్ పార్టీ శ్రీనివాసులు రెడ్డి, మౌలాలి, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.