YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు

రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:    

మంత్రులు యనమల రామకృష్ణుడు, నక్కా ఆనందబాబు  గురువారం మీడియాతో మాట్లాడారు.  యనమల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేని శక్తులు ఒక కూటమిగా ఏర్పడి కుట్రలు పన్నుతన్నారు. టీఆర్ ఎస్, మోడీ,  జగన్ ముగ్గురు కలిసి తెలుగుదేశం పార్టీ ని దెబ్బతీయలని చూస్తున్నారు. జగన్ ఒక క్రిమినల్ మనస్తత్వం కలిగిన వ్యక్తి. జగన్ ఎదుర్కోలేడని వీళ్లంతా జగన్ కి సహకరిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం విభజన చట్టంలో హామీలు అమలు చేయకుండా రాష్ట్రాన్ని ఇబ్బందులు గురిచేస్తుంది. విభజన లో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్రాన్ని ఇబ్బందులు గురి చేయాలనే ఉద్దేశంతో ఈ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని మరింత అన్యాయం చేయాలని చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గెలుపు ను ఎవరు ఆపలేరు. జగన్ కుటుంబం చరిత్ర అందరికి తెలుసు. జగన్ ఫ్యామిలీ ఎదుటివారు బాగుపడకూడదు..వాళ్ళ పరిపాలన లేని రాష్ట్రాన్ని దెబ్బతీయలన్నదే వారి ఉద్దేశ్యమని అన్నారు. ఎస్సి, ఎస్టీ, బిసి భూముల ను దుర్వినియోగం కు ప్రత్యేక చట్టాన్ని రాజశేఖర్ రెడ్డి తీసుకుని వచ్చారు. లక్షకోట్లు దోచుకున్న జగన్ సొమ్ము రాష్ట్రానికి రావాల్సి ఉంది. రాష్ట్రప్రజల సొమ్మును దోచుకున్న జగన్ అధికారం ఇస్తారని ప్రజలు అనుకోవడం లేదు. 
ఇప్పటికి ఎప్పటికీ వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీ వెంట ఉంటారని యనమల అన్నారు. మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ నరేంద్రమోడీ శాసించడం,  జగన్, కేసీఆర్ పాటిస్తారు. అధికారం జగన్ కి ఎండమావిగానే మిగులుతుంది. కుట్రలు కుటంత్రలు లతో పని చెస్తున్నారు.  కులాలను, వర్గాలను రెచ్చగొట్టి అశాంతి కి గురి చెయ్యాలని.జన్మోహన్ రెడ్డి గతంలో ప్రయత్నించాడు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నడు. పీకే ని అడ్డం పెట్టుకొని కుట్రలు చేస్తున్నారని అన్నారు. తండ్రి శవాన్ని దగ్గరపెట్టుకొని సీఎం పదవి సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చిన్న తనంలోనే తండ్రి అధికార న్ని అడ్డంపెట్టుకుని ప్రజల సొమ్మును దోచుకున్నాడు. మోడీ కి దాసోహం అయి కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తకట్టుపెట్టినారని అన్నారు. కేసీఆర్ ఇచ్చే ఎంగిలమెతుకులకోసం జగన్మోహనరెడ్డి కుమ్మక్కై కుట్రలు చేస్తున్నాడు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోంది.. జగన్ కి అధికారం ఇస్తే కుక్కలు చింపే ఇస్తారాకుగా తయారవుతుంది. కుట్రలు, కుతంత్రాలతో ప్రజలను నమ్మించె ప్రయత్నాలు జగన్ చేస్తున్నాడని ఆనందబాబు విమర్శించారు.

Related Posts