YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గుంటూరు జిల్లా నుంచి లోకేశ్ పోటీ ఖాయమేనా..!

 గుంటూరు జిల్లా నుంచి లోకేశ్ పోటీ ఖాయమేనా..!

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:    

లోకేశ్ ఉత్తరాంధ్ర లేదా రాయలసీమ నుంచి పోటీ చేస్తారంటూ కొద్దికాలంగా ప్రచారం సాగుతోంది. అయితే చంద్రబాబు రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో లోకేశ్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలని కొందరు నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేశ్ పోటీ చేసే నియోజకవర్గంపై టీడీపీ ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది.
గుంటూరు జిల్లా పెదకూరపాడు నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు నారా లోకేశ్. చాలా కాలంపాటు పార్టీ వ్యవహారాలే చూసుకున్న ఆయన 2014 ఎన్నికల్లో సైతం పోటీ చేయలేదు. అయితే 2017లో లోకేశ్కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన చంద్రబాబు, ఆ తర్వాత తన కేబినెట్లోకి తీసుకున్నారు. దొడ్డిదారిన మంత్రి అయ్యారంటూ ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా లోకేశ్ మాత్రం తన పనితీరుతోనే వారికి సమాధానమిచ్చారు. తొలిసారి మంత్రి అయినా తన శాఖలపై త్వరగానే పట్టు సాధించారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో లోకేశ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న చర్చ తెలుగుదేశం పార్టీలో జోరుగా సాగుతోంది.   లోకేశ్ ఉత్తరాంధ్ర లేదా రాయలసీమ నుంచి పోటీ చేస్తారంటూ కొద్దికాలంగా ప్రచారం సాగుతోంది. అయితే చంద్రబాబు రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో లోకేశ్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలని కొందరు నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రతిపాదన ఇప్పుడు పక్కకెళ్లినట్లు తెలుస్తోంది. లోకేశ్ అమరావతి ప్రాంతం నుంచే బరిలో దిగనున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. రాజధాని అమరావతికి కూతవేటు దూరంలోనే ఉన్న పెదకూరపాడు నియోజకవర్గం టీడీపీకి పెట్టని కోట. ఇక్కడ నుంచి పోటీ చేస్తే లోకేష్ ఘనవిజయం ఖాయమని పార్టీ నేతలు చెబుతుండటంతో దీనికి సంబంధించి కసరత్తు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 
ప్రస్తుతం పెదకూరపాడు ఎమ్మెల్యేగా కొమ్మలపాటి శ్రీధర్ ఉన్నారు. లోకేశ్ ఇక్కడి నుంచి పోటీచేస్తే శ్రీధర్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే యోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. అయితే అభివృద్ధి చెందుతున్న అమరావతి ప్రాంతం నుంచి కాకుండా అభివృద్ధికి దూరంగా ప్రాంతం నుంచి లోకేశ్ పోటీ చేస్తే బాగుంటుందని మరికొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. లోకేశ్ ఉత్తరాంధ్ర నుంచి గానీ, ప్రకాశం జిల్లా నుంచి గానీ పోటీ చేయాలని ఓ వర్గం కోరుతోందట. దీనిపై లోకేశ్ ఎలా స్పందిస్తారన్న దానిపై పార్టీలో ఆసక్తి నెలకొంది. 

Related Posts