యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
వేసవి రాకముందే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నా యి. రాష్ట్రంలో ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు పె రిగాయి. దీంతో జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే.. మున్ముం దు ఎలాంటి పరిస్థితి ఉంటుందోనని ప్రజలు ఊ హించుకోవడానికే హడలి పోతున్నారు. శుక్రవారం విజయవాడలో 36 డిగ్రీలు, అనంతపురంలో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే గురు వారం కర్నూలులో 36.3, విశాఖపట్నం, అనంత పురంలో 35 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. సముద్రం నుంచి గాలులు లేకపోవడంతో పగలు ఎండలు పెరిగాయని వాతావరణ శాఖ అధికారు లు చెబుతున్నారు. అలాగే రాత్రి వేళల్లో చలి ఎక్కువగా ఉంటోంది. ఆకాశం నిర్మలంగా ఉండటంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుం చి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఇక నుంచి పగటి ఉష్ణోగ్రతలు క్రమేణా పెరు గుతాయని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.