YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కంది రైతులకు గొనె సంచెలు

 కంది రైతులకు గొనె సంచెలు
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:   
నల్గొండ:
నల్గొండ జిల్లాలో ఒకే కొనుగోలు కేంద్రం కావడంతో వివిధ ప్రాంతాల నుండి వస్తున్న ధాన్యం వాహనాలతో మార్కెట్ యార్డు కిక్కిరిసిపోతోంది. ధాన్యం తీసుకువచ్చిన రైతులకు మార్కెట్ సిబ్బంది టోకెన్లు ఇచ్చి లోపలికి అనుమతిస్తున్నారు. మూడు రోజుల క్రితం తీసుకువచ్చిన ధాన్యాన్ని గోనె సంచుల కొరతతో ఇప్పటి వరకు తూకం వేయలేదు. సోమవారం భారీ స్థాయిలో ధాన్యం రావడంతో గోనె సంచులు సరిపడా లేక తప్పని పరిస్థితులలో మంగళవారం, బుధవారం కొనుగోళ్లు నిలిపివేశారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 15,500 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. బయట దళారులు క్వింటాలకు రూ.4200-రూ.4500 మధ్య కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర రూ.5050 చెల్లిస్తుండడంతో మార్కెట్‌లో అమ్మకానికే రైతులు మొగ్గుచూపుతున్నారు. కాగా మార్కెట్‌లో ఇప్పటికే సుమారు 3000 క్వింటాళ్ల తూకం వేయని ధాన్యం ఉందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా సిబ్బందిని, తూకం వేసే కాంటాలను పెంచి ధాన్యాన్ని తూకం వేసిన తరువాతనే మిగతా రైతులకు టోకెన్లు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ రైతులకు సౌకర్యాలు మెరుగపర్చాలన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు 15 రోజులలో డబ్బులు ఖాతాలో జమచేస్తామని చెబుతున్నా జాప్యం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. బిల్లుల చెల్లింపుల జాప్యం గురించి కొనుగోలు కేంద్రం బాధ్యుడు రాజేందర్‌ను వివరణ కోరగా సాంకేతిక సమస్యలతో ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోందన్నారు. బిల్లులు చెల్లింపు అయింది, లేనిది తెలుసుకోవటానికి రైతులు హైదరాబాదులోని హాకా సహాయ కేంద్రానికి ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు.

Related Posts