YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రదాని మోదీపై మరోసారి నిప్పులు చిరిగిన రాహుల్‌గాంధీ

 ప్రదాని మోదీపై మరోసారి నిప్పులు చిరిగిన రాహుల్‌గాంధీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:       

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్లకు అమరవీరుల హోదా ఇవ్వని కేంద్రం.. అనిల్‌ అంబానీకి మాత్రం రూ. 30వేల కోట్లు కట్టబెట్టిందని రాహుల్‌ దుయ్యబట్టారు.‘40 మంది జవాన్లు ప్రాణ త్యాగం చేశారు. వారి కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. అయినా ఆ ధీరులకు అమరవీరుల హోదా ఇవ్వట్లేదు. ఈ వ్యక్తికి(అనిల్ అంబానీని ఉద్దేశిస్తూ) ఎప్పుడూ తీసుకోవడమే గానీ ఇవ్వడం తెలియదు. అలాంటి వ్యక్తికి రూ. 30వేల కోట్ల జవాన్ల డబ్బును బహుమతిగా ఇచ్చారు. మోదీ చెబుతున్న ఈ నవభారతానికి స్వాగతం’ అంటూ రాహుల్‌ చురకలంటించారు.పుల్వామా దాడి తర్వాత రాహుల్‌ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఇదే తొలిసారి. పుల్వామా దాడిపై రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి విపత్కర సమయంలో కేంద్రానికి, జవాన్లకు అండగా ఉంటామని తెలిపారు. ఆ తర్వాత వారం పాటు ఆయన విమర్శలు చేయలేదు. అయితే ఇటీవల భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా అసోంలోని ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. ‘ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదు. సైనికుల త్యాగాలు వృథాగా పోవు’ అని అమిత్ షా విమర్శించారు. దీంతో రాహుల్‌ నేడు ట్విటర్‌ వేదికగా కేంద్రంపై మండిపడ్డారు.

Related Posts