YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైకాపా ప్రలోభాలను ఎండగట్టాలి

 వైకాపా ప్రలోభాలను ఎండగట్టాలి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:       

కృష్ణా, కడప, కర్నూలు మూడు జిల్లాల సమీక్ష పూర్తి చేశాం. నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్ష పూర్తి అయ్యాయి. మరో 2పార్లమెంట్ నియోజకవర్గాలపై శుక్రవారం సమీక్ష చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఉదయం అయన టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, పార్టీ బాధ్యులు పాల్గోన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ అన్నిస్థాయిల్లో తెలుగుదేశం పార్టీని సంసిద్ధం చేస్తున్నాం. జాతీయ స్థాయిలో సహకరించే పార్టీలకే టిడిపి మద్దతు వుంటుంది. ఏపి ప్రయోజనాలు నెరవేర్చే పార్టీలకే మద్దతు. జాతీయస్థాయిలో కలిసివచ్చే పార్టీలతో కలిసి నడుస్తాం. రాష్ట్రంలో ప్రజాభీష్టం మేరకు ఎవరికివారే పోటీ చేస్తామని అన్నారు. అమిత్ షా నిన్న వచ్చి అవాకులు చవాకులు వాగారు. రాష్ట్రానికి గత 5 ఏళ్లలో బిజెపి చేసిందేమీ లేదు. 90 %  చేసేసినట్లుగా అమిత్ షా పచ్చి అబద్దాలు చెప్పారు. అమిత్ షా కాదు అతనో అబద్దాల షా అని విమర్శించారు. 
రాష్ట్రానికి బిజెపి చేసిందేమీ లేదు. ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. తప్పు చేశామన్న పశ్చాత్తాపం బిజెపి నేతల్లో లేదు. ఇంకా రెచ్చగొడుతున్నారు. బాధ పెడుతున్నారని అన్నారు. రెచ్చగొట్టి,బాధపెట్టి బిజెపి నేతల ఆనందం. అమిత్ షా వ్యాఖ్యలపై రాష్ట్రంలో చర్చ జరగాలని అన్నారు. ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చారా..? విశాఖపట్నానికి రైల్వేజోన్ ఇచ్చారా..? కడపలో స్టీల్ ప్లాంట్ కు నిధులిచ్చారా..? కాకినాడలో పెట్రోకాంప్లెక్స్ పెట్టారా..?  ఏం చేశారని 90% లెక్క చెబుతున్నారు? ఇచ్చిన రూ.350కోట్లు ఎందుకు వెనక్కి తీసుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంపై నరేంద్రమోది,అమిత్ షా కక్ష కట్టారు. పగ,  ప్రతీకారంతో వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పై కెసిఆర్ ది అసూయ, ద్వేషం. ఈ రెండు పార్టీలతో జగన్మోహన్ రెడ్డి లాలూచి పడ్డారని అన్నారు.  కేసుల మాఫీ కోసం బిజెపితో జగన్ లాలూచి పడుతున్నారు. డబ్బుల కోసం కెసిఆర్ తో జగన్ లాలూచి. మోసాలు చేస్తోంది, నమ్మక ద్రోహం చేసింది బిజెపి. కుట్రలు,కుతంత్రాల జోడి బిజెపి, వైసిపి అని అన్నారు. దొంగే, దొంగ..దొంగ’ అన్నట్లుగా వైసిపి వ్యవహరిస్తోంది. వాళ్లు చేసే తప్పుడు పనులు ఇతరులకు ఆపాదిస్తారు. 
తప్పుడు సర్వేలతో ప్రజలను మోసం చేస్తున్నారు.  దొంగ ఓట్లు చేర్చేది వాళ్లే, ఫిర్యాదులు పంపేది వాళ్లే. తప్పుడు మెయిల్స్, దొంగ సర్వేలలో ఆరితేరారని అన్నారు. డబ్బుల కోసమే జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన చెస్తున్నారు. ఎన్నికల ముందు ఎవరూ విదేశీ పర్యటనలకు వెళ్లరు. వైసిపి,బిజెపి కుట్రలపై ప్రజల్లో చర్చ జరగాలి. స్థానికంగా వైసిపి ప్రలోభాలను ఎండగట్టాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

Related Posts