యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 డిగ్రీ కళాశాలలు, 20 జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని నిశ్చయించినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశంలో విద్యకోసం ఎక్కువ బడ్జెట్ కేటాయించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందన్నారు.
జూనియర్ కళాశాలలు
అనంతపురం జిల్లా కల్యాణదుర్గ నియోజకవర్గం బెలగుప్ప మండలం, బెలగుప్ప గ్రామం, రాయదుర్గం నియోజకవర్గం, రాయదుర్గం మండలం, రాయదుర్గం గ్రామం, హిందూపురం నియోజకవర్గం ముద్దిరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం మళ్లనూరు, పలమనేరు నియోజకవర్గ కేంద్రంలో బాలికల జూనియర్ కళాశాల, తూర్పుగోదావరి జిల్లా రాజోలు (ఎస్.సి) నియోజకవర్గం మలికిపురం మండలం కేశనపల్లి, రంపచోడవరం (ఎస్.టి) నియోజకవర్గం నెల్లిపాక, కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండల కేంద్రం, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం నాగులదిన్నె గ్రామం, నంద్యాల నియోజకవర్గ కేంద్రం నంద్యాలలో ఉర్దూ మీడియం జూనియర్ కళాశాల, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం (ఎస్.సి) నియోజకవర్గం పెదారవీడు, జిల్లా కేంద్రం ఒంగోలు, శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలం గోవిందాపురం, పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం నివగాం, విశాఖజిల్లా గాజువాక నియోజకవర్గం మల్కాపురం, భీమునిపట్నం నియోజకవర్గం భీమిలి మండలం ఆనందపురం, ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం లాలంకోడూరు, విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం మండల కేంద్రం దత్తిరాజేరు, చీపురుపల్లి నియోజకవర్గం మండల కేంద్రం మెరకముడిదాం, పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం (ఎస్.సి) నియోజకవర్గం, దేవరపల్లి మండలం ఎర్నగూడెంలలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి జూనియర్ కళాశాలలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
డిగ్రీ కళాశాలలు
చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గం కురబలకోట, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం (మహిళా డిగ్రీ కళాశాల), రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండల కేంద్రం, జగ్గంపేట నియోజకవర్గం మండలకేంద్రం కిర్లంపూడి, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం ఇచ్ఛాపురం, టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి, విశాఖ జిల్లా భీమునిపట్నం నియోజకవర్గం తగరపువలస (మహిళా డిగ్రీ కళాశాల), విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం గజపతినగరం, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం (మహిళా డిగ్రీ కళాశాల), కొవ్వూరు (ఎస్సి) నియోజకవర్గం కొవ్వూరులో డిగ్రీ కాలేజీలు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి తెలిపారు.