YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మాయతో అఖిలేశ్ దోస్తీ.. ములాయం సంచలన వ్యాఖ్యలు

మాయతో అఖిలేశ్ దోస్తీ.. ములాయం సంచలన వ్యాఖ్యలు
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:       
సాధారణ ఎన్నికలకు ఉత్తర్ప్రదేశ్లో బీఎస్పీ-ఎస్పీ మధ్య పొత్తు పొడిచిన విషయం తెలిసిందే. మొత్తం 80 స్థానాలకు గానూ ఎస్పీ 37, బీఎస్పీ 38 చోట్ల పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. దీనిపై ఎస్పీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయంసింగ్ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యూపీలో ఎస్పీ బలంగా ఉందని, బీఎస్పీకి 38 లోక్సభ స్థానాలు కేటాయించాల్సిన అవసరమేంటని ఆపార్టీ అధ్యక్షుడు, తనయుడు అఖిలేశ్ యాదవ్ను ప్రశ్నించారు. లఖ్నవూలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘మనం చాలా బలంగా ఉన్నాం. కానీ, మన మనుషులే పార్టీని బలహీనపరుస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, లోక్సభ ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయాలనుకుంటే తనను సంప్రదించాలని ములాయం సూచించారు. అఖిలేశ్ తీసుకున్న ఏ నిర్ణయాన్నైనాసరే తాను మార్చగలనని, ఎన్నికలకు బీజేపీ మెరుగ్గా సన్నద్ధమవుతోందని అన్నారు. ఇప్పటికే బీజేపీ తన అభ్యర్థులను సిద్ధం చేసిందని, ఈ విషయంలో ఎస్పీపై ఆ పార్టీదే పైచేయి అని ములాయం అభిప్రాయపడ్డారు. 
కాబట్టి అఖిలేశ్ సైతం ఎస్పీ తరఫున బరిలోకి నిలిచే అభ్యర్థులను ఖరారు చేసి, ప్రచారం ప్రారంభించాలని ఆయన సూచించారు. కేవలం ఎస్పీ-బీఎస్పీ, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని, మూడో పార్టీకి స్థానం లేదని పరోక్షంగా కాంగ్రెస్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. యూపీ తూర్పు బాధ్యతలను ప్రియాంకా గాంధీకి అప్పగించడంతో దీని ప్రభావం ఉంటుందనే ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. 
పార్లమెంటు సమావేశాల ముగింపు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై ములాయం ప్రశంసలు కురిపించి, అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. అందర్నీ కలుపుకుని ముందుకెళ్లడంలో మోదీ విజయం సాధించారని, ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారు మరోసారి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు ప్రకటించిన ములాయం, మోదీనే మళ్లీ ప్రధాని కావాలని వ్యాఖ్యానించారు. 
వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చింది. రాష్ట్రంలో మొత్తం 80 సీట్లకుగాను ఎస్పీ 37 స్థానాల్లో, బీఎస్పీ 38 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నాయి. ఈ మేరకు సీట్ల పంపిణీపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి సంతకాలతో కూడిన ప్రకటన గురువారం వెలువడింది. అమేథీ, రాయబరేలీ స్థానాలను కాంగ్రెస్కు వదిలేయగా, మిగతా మూడు సీట్లను కూటమిలో మిగతా పార్టీలకు కేటాయించాలని నిర్ణయించారు.

Related Posts