YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ ఓటమి ఖాయం

 టీడీపీ ఓటమి ఖాయం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:       

ఎపి లో ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో లో బాగా వేడి రాజుకుంటుంది. అధికార టిడిపి కుట్ర తో వ్యవరిస్తూ బిజేపి పై నిందలు వేస్తున్నారు. పది నెళుగా వారు ఆడుతున్న డ్రామాలకు ప్రజలు ముగింపు పలుకుతారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల తరువాత ఎపిలో టిడిపి పూర్తిగా కనుమరుగవుతుంది. దేశ వ్యాప్తంగా బిజెపి విజయం ఖాయం, అదే విధంగా ఎపి లో టిడిపి పరాజయం ఖాయం అని అన్ని జాతీయ సర్వే సంస్థలు చెబుతున్నాయి. ఎపి గడ్డ పై మోడి అడుగు పెట్టిన దగ్గర నుంచి టిడిపి కి గడ్డు పరిస్థితులు ప్రారంభం అయ్యాయి. అమిత్ షా కూడా తన పర్యటన ద్వారా కేంద్రం ఏపికి ఐదున్నర లక్షలు ఇచ్చిన సాయాన్ని వివరించారు. ప్రజలకు నిజాలు తెలిసిపోతుందనే భయం టిడిపి నేతల్లో ఉందని అన్నారు. కేంద్రం ఇచ్చిన పధకాలను స్టిక్కర్కు వేసుకుని ప్రచారం చేసుకుంటూ స్టిక్కర్ బాబుగా చంద్రబాబు మారిపోయారు. పోలవరం కు 6,700కోట్లు ఇస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు.  మోడి పధకాలను చంద్రన్న పధకాలుగా మార్చుకోవడం తప్ప చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదు. 
సర్జికల్ స్ట్రైక్, టాయిలెట్ ప్రేమ్ కధ పేరుతో మోడి పని తీరుపై తీసిన సినిమాలు మంచి విజయం సాధించాయని అన్నారు. కానీ మీరు యన్టీఆర్ పేరుతో తీసిన సినిమాను కూడా ప్రజలు వ్యతిరేకించారు. మీ సినిమాలో అసలు విషయాలు పక్కన పెట్టినందువల్లే ఫ్లాప్ అయ్యాయని అయన అన్నారు. కేంద్రం12కోట్ల మంది రైతులకు యేడాదికి ఆరువేలు ఇచ్చే పధకాన్ని ప్రారంభించాం. దీనికి కూడా చంద్రబాబు స్టిక్కర్ వేసుకుని లబ్ది పొందాలని చూశారు. సబ్ కా వికాస్ విధానమే మా నినాదం.. అన్ని వర్గాల వారికి మేలు చేసేలా మోడి పాలన ఉందని అన్నారు. ఇప్పటికైనా టిడిపి తప్పుడు విధానాలను విడనాడాలి. 
మోడి, అమిత్ షా పర్యటనలతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అందుకే.. అన్నీ మా గొప్పే అని చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అవినీతి టిడిపిని ఇంటికి పంపించాలని ప్రజలను కోరుతున్నానని అన్నారు. మా పార్టీ దేశంలో అధికారం లోకి వస్తుంది, మరో ఐదేళ్లు మోడి ప్రధానిగా ఉంటారు. చంద్రబాబు ఓడిపోయి, ఇంట్లో కూర్చోవడం ఖాయం. ప్రతిపక్ష నేత విదేశాలకు వెళితే డబ్బులు తెచ్చేందుకే అని టిడిపి నేతలు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. 
ఈ లెక్కన చంద్రబాబు బ్యాచ్ ముందే డబ్బులు సిద్దం చేసుకున్నారా అని ప్రశ్నించారు. మరి చంద్రబాబు, టిడిపి నేతలు పర్సనల్ విజిట్స్ కు సింగపూర్, దుబాయ్, అబుదాబి, ఎందుకు వెళ్లారో ప్రజలకు చెప్పాలి. సోమిరెడ్డి, చంద్రబాబు, లోకేష్ లు కూడా వెళ్లారు. ఎదుటి వారిని ప్రశ్నించే ముందు మనం అన్ని విషయాలు చెప్పాలి. ప్రభుత్వం తరపున ఉన్న వారికి మరింత బాధ్యత ఉంటుంది. విదేశీ టూర్లకు వెళ్లడం వల్ల ఎపికి జరిగిన మేలేమిటో ప్రజలకు చెప్పాలని అన్నారు. 

Related Posts