YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కులం పేరుతో కుట్రలు

కులం పేరుతో కుట్రలు
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:       
రాష్ట్రంలో లో ప్రస్తుతం కులం పేరుతో  వైకాపా, బీజేపీ నేతలు కుట్రలు మొదలుపెట్టారని,  
త్వరలోనే మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని  మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఏపీకి ప్రత్యేకహోదా,  విభజన హామీల అమలు విషయంలో వెనక్కి తగ్గబోమని అయన స్పష్టం చేశారు. శుక్రవారం నాడు  ట్విట్టర్ లో లోకేశ్ స్పందిస్తూ జగన్, మోదీ రెడ్డి ద్వయం ఎన్ని కుయుక్తులు పన్నినా ఫలితం వుండదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కి  ప్రత్యేక హోదా ఇచ్చేవరకూ కేంద్రాన్ని, ప్రధాని మోదీ ని నిలదీయడంలో  వెనక్కి తగ్గేది లేదని  ట్వీట్ చేశారు. వైసీపీ అధినేత జగన్, ప్రధాని నరేంద్ర మోదీలను విమర్శిస్తూ ‘చంద్రబాబు జెండా అభివృద్ధి, ఎజెండా సంక్షేమం. జగన్, మోదీ జోడి ఎన్నికల జెండా కులం. ఎజెండా మతమని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో చంద్రబాబు తో పోటీ పడలేమని డిసైడైపోయిన జగన్, మోదీ జోడి రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తోందని  ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు.

Related Posts