యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలినడక మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. ఇంత తక్కువ సమయంలో తిరుమలకు చేరుకున్న మొదటి రాజకీయ నాయకుడిగా రాహుల్ గాంధీ రికార్డ్ సృష్టించారు. కాలినడకన వెళుతున్న సమయంలో భక్తులతో కరచాలనం చేస్తూ చిరునవ్వుతో పలకరించారు. దారి పొడవునా రాహుల్ గాంధీతో కరచాలనం చేసేందుకు భక్తులు ఎగబడ్డారు. అలిపిరిలో ఉదయం 11:40 గంటల సమయంలో నడక ప్రారంభించి మధ్యాహ్నం 1:30 గంటలకు కొండపైకి చేరుకున్నారు. కేవలం గంటా 50 నిమిషాల వ్యవధిలోనే తిరుమలకు చేరుకున్నారు. మేనల్లుడు రేహాన్ వాద్రాతో కలసి పోటీపడుతూ నడిచారు. నడక మార్గంలో ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా సుమారు 3500లకు పైగా మెట్లు ఎక్కారు. తిరుమలలో పంచకట్టులో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ సాంప్రదాయ దుస్తుల్లో దర్శనానికి వెళ్ళారు. జీఎన్‌సీ ప్రాంతం నుంచి నడుస్తూనే అతిథి గృహానికి చేరుకున్నారు. గాలిగోపురం వద్ద సాధారణ భక్తుడిలా దివ్యదర్శనం టోకెన్లను పొందారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. తిరుమలలో పంచకట్టులో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ సాంప్రదాయ దుస్తుల్లో దర్శనానికి వెళ్ళారు.