యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎన్టీఆర్ అనారోగ్యంతో ఉన్నప్పుడు కనీసం తిండి కూడా పెట్టని వారు సినిమాలో తనను విలన్ గా చూపిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కించిన మహానాయకుడు సినిమా ఇవాళ విడుదలైంది. సినిమాలో ప్రధాన విలన్ గా నాదెండ్ల భాస్కర్ రావును చూపించారు. ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానల్ తో మాట్లాడిన నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ చివరి దశలో, పక్షపాతం వచ్చి బాధపడ్డ సమయంలో 12 మంది సంతానం ఉండి కనీసం మంచి నీళ్లు, ఆహారం కూడా ఇవ్వలేదని ఆరోపించారు.ఎన్టీఆర్ ను చంపిందే ఆయన కుటుంబసభ్యులు, చంద్రబాబు అని పేర్కొన్నారు. భోజనం, ఖర్చుల కోసం 25 లక్షలు ఎన్టీఆర్ పక్కన పెట్టుకుంటే.. కోర్టుకు వెళ్లి ఆ డబ్బులు కూడా తీసుకోకుండా స్టే తెచ్చారని గుర్తు చేశారు. కుటుంబసభ్యులు ఆహారం కూడా పెట్టని సమయంలో లక్ష్మీపార్వతి వచ్చి ఎన్టీఆర్ కు చాలా సపర్యలు చేశారని, ఆమె వల్లే ఎన్టీఆర్ ఆరోగ్యం మళ్లీ మెరుగైందన్నారు. చంద్రబాబును ప్రొజెక్ట్ చేయానికే ఈ సినిమా తీశారని, అసలు విలనే చంద్రబాబు అన్నారు. నిజానిజాలు ఏంటో ప్రజలకు తెలుసని, తాను విలన్ నా కాదా అనేది ప్రజలు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.