Highlights
- విశ్వశాంతి మహాయాగములు
- ఏప్రిల్ 14 నుండి 27 వరకు
- 14రోజులు పాటు
- పెద్దాపురం-సామర్లకోట టి.జంక్షన్
- పాండవులమెట్ట దిగువన
యజ్ఞోవై విష్ణుః! యజ్ఞ ఏవాన్ తతః ప్రతితిష్ఠతి!!జగద్గురువుల ఆశీస్సులతో,
మురమళ్ల శ్రీ భద్రకాళీసమేత వీరేశ్వరస్వామివారి అనుగ్రహంతో...
1995సంవత్సరం నుండి 16 స్మార్త యాగములతోపాటు 2012లో భద్రాచలంలోఅతిరాత్రం ఉత్కృష్ట సోమయాగమును, 2013లో మురమళ్ల (తూ.గో.జిల్లా) లో అతిరుద్రం మహాయాగము, 2015లో కర్నూలులో అప్తోర్యామం మహాసోమయాగము, మహాసౌరంమహాయాగము మరియు 2017లో యాదాద్రి (యాదగిరిగుట్ట, తెలంగాణ)లో 126 రోజులపాటు శ్రీపంచాయతన సహిత అయుత శ్రీమహావిష్ణుమహాయాగం ఇత్యాది 21మహాయాగములను నిర్వహించి విశేష బహుయజ్ఞకర్తగా పేరుగాంచిన హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ కేసాప్రగడ హరిహరనాధ శర్మగారి పర్యవేక్షణలో 2018 ఏప్రిల్ 14 నుండి 2018 ఏప్రిల్ 27 వరకు 14రోజులు, తూర్పుగోదావరి జిల్లా, పెద్దాపురం-సామర్లకోట టి.జంక్షన్ వద్ద, పాండవులమెట్ట దిగువన, సువిశాల ప్రాంగణం సప్త సోమయాగములలో ఆరవదైన, మహోత్కృష్టమైనఅతిరాత్రం – మహాగ్నిచయన పూర్వక శ్రౌతసోమయాగము మరియు పుత్రకామేష్టి, శ్రీప్రత్యంగిరాహోమము ఇత్యాది మహోన్నతమైన విశ్వశాంతి మహాయాగములను నిర్వహిస్తున్నారు.
ఈ బృహత్కార్య నిర్వహణ చాలా క్లిష్టతరమేగాక, బహు వ్యయ- ప్రయాసలతోకూడినది. ఈ విశ్వశాన్తి ప్రయత్నమునకు జాతి- మత- కుల- వర్గ- వర్ణ విచక్షణా రహితముగా ప్రతి ఒక్కరు తమ యథోచితముగా ధన- మన- వస్తు- సేవా రూపేణ సహకరించి, తరించగలరు.