YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అయోమయంలో జ్యోతుల నెహ్రు

అయోమయంలో జ్యోతుల నెహ్రు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:       

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గ పంచాయితీ ఇప్పుడు టిడిపి అధినేతకు తలపోటుగా మారింది. జగ్గంపేట టికెట్ మాకంటే.. మాకు అంటూ కాకినాడ ఎంపి తోట నరసింహం, సిట్టింగ్ ఎమ్యెల్యే జ్యోతుల నెహ్రు నడుమ సమరం రోజు రోజుకు పెరుగుతుంది. దాంతో ఇరువర్గాలు ప్రతిష్టకు పోతున్నాయి. అనారోగ్య కారణాలతో కాకినాడ ఎంపి గా పోటీ కి దూరంగా వుండాలని నరసింహం భావిస్తున్నారు. అయితే తన భార్య వాణి కి టికెట్ సాధించి దశాబ్దాలుగా జగ్గంపేట పై తమ కుటుంబం సాగించే పట్టును కొనసాగించాలన్న సంకల్పంతో వున్నారు కాకినాడ ఎంపి.మరో పక్క జ్యోతుల నెహ్రు తోట వ్యవహారంపై గుర్రుగా వున్నారు. తనకు ఏమి చెప్పి వైసిపి నుంచి తీసుకువచ్చారన్నది ఆయన పాయింట్. జగ్గంపేట టికెట్ తనకే అని ధృవీకరించాకే అధికారపార్టీలో చేరినట్లు చెబుతున్నారు. కానీ అధిష్టానం మంత్రివర్గం నుంచి అన్నిటా హ్యాండిచ్చింది అనే బాధ ఆయన్ను ఇంకా వెంటాడుతుంది. నిజానికి ఇచ్చిన హామీల్లో టిడిపి ఒక హామీని ఇప్పటికే తీర్చేసింది. జ్యోతుల కుమారుడికి జడ్పి చైర్మన్ కల్పించడం ఒప్పనందంలో భాగం అంటారు.తమకొకటి జగ్గంపేట టికెట్. ఒక హామీని తీరినా రెండో అంశమే వివాదాస్పదంగా మారింది. దాంతో అటు జ్యోతుల ఇటు నరసింహం ఎన్నికల ముందే యుద్ధం మొదలు పెట్టినట్లు అయ్యింది. అయితే ఇరువురు ఒకే పార్టీ నేతలు కావడం తో టిడిపి క్యాడర్ తీవ్ర కలవరానికి గురి అయ్యి అధినేత ఎంత తొందరగా జగ్గంపేట వివాదానికి చెక్ పెడతారా అని ఎదురు చూస్తున్నారు. మరి బాబు ఎలాంటి వ్యూహం అమలు చేస్తారో చూడాలి

Related Posts