Highlights
- 10లక్షల కియా కార్ల ఉత్పత్తి
- ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి
- మూడున్నరేళ్లలో 19,465 ఎంవోయూలు
- ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో కార్ల పరిశ్రమను ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పెనుకొండ పరిధి ఎర్రమంచిలో దక్షిణ కొరియాకు చెందిన కియా కంపెనీ ఫ్రేమ్ వర్స్ ఇన్స్‌స్టలేషన్ యూనిట్ ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..
కియా పరిశ్రమ కోసం ఏపీకి రావడం మంచి ప్రారంభమని.. దీని ద్వారా ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు వస్తాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు ఎలాంటి లోటు లేదని, కియా మోటార్స్‌కు అన్ని రకాలుగా సహకరిస్తామని పేర్కొన్నారు. కియా సంస్థ ద్వారా ఏడాదికి 10లక్షల కార్లు ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నామని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు చాలామంది ముందుకొస్తున్నారని, మూడున్నరేళ్లలో 19,465 ఎంవోయూలు కుదుర్చుకున్నామని తెలిపారు.ఈ సందర్భంగా కియా కంపెనీకి భూములు ఇచ్చిన రైతులకు చంద్రబాబు.కృతఙ్ఞతలు చెప్పారు