యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఇప్పటి వరకూ ‘అంతా నా ఇష్టం’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను చేసిన వీడియోలకు, చేయబోయే వీడియోలకు పవన్ కళ్యాణ్‌కి గాని.. జనసేన పార్టీకి కాని ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం నా సొంత బాధ్యత మాత్రమే. సెకండ్ వరల్డ్ వార్ సమయంలో అడాల్ప్ హిట్లర్ అనే ఒక నరరూప రాక్షసుడు ఉండేవాడు. అతడికి కొన్ని ప్రచార సాధనాలు ఉన్నాయి. వీటి ద్వారా తన పార్టీ గురించి ఎక్కడలేని బిల్డప్పులు ఇచ్చుకునేవాడు. దానికి ప్రధాన సూత్రధారి అతడి ప్రచార శాఖకు సంబంధించిన మినిస్టర్ గోబెల్స్. వాడు అడాల్ప్ హిట్లర్ అలాగా ఇలాగా.. అని బిల్డప్పులు ఇవ్వడానికే అతడి పెట్టుకున్నాడు. ఆరోజుల్లో జనం ఏంటంటే.. ఆ గోబెన్స్ ప్రచారానికి ప్రభావితం అయ్యేవారు. కారణం ఏంటంటే ఆ కాలంలో సోషల్ మీడియా లేదు కాబట్టి గోబెల్స్ లాంటి గొట్టం గాళ్లకు చాలా ఈజీ అయ్యింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే.. ఇవాళ నేడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అలాంటి గోబెల్స్ గాళ్లు చాలా మంది తయారయ్యారు. ఉదాహరణకు వాళ్లు జనసేనను తొక్కేయాలని, జనసైనికులను మానసికంగా కృంగదీయాలని నీచమైన ఆలోచనలు చేస్తున్నారు. టీడీపీ వాళ్లు వైసీపీతో కలిసిపోయింది అంటున్నారు. వైసీపీవాళ్లు టీడీపీతో కలిసిపోయింది అంటున్నారు. మధ్యలో బీజేపీతో కలిసింది అన్నారు. కళ్యాణ్ బాబు అంత ఓపెన్‌గా చెప్పినా కొంచెం కూడా సెన్స్ లేదా? కళ్యాణ్ బాబు మీ లాగా కన్వెన్షనల్, క్రిమినల్, ఫ్యాక్షన్, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియాలు చేసే వ్యక్తి కాదు. మీ లాంటి ప్రభుత్వాలను ఏర్పరిచే వ్యక్తి కాదు. ఒక జెన్యూన్ ప్రభుత్వాన్ని ప్రజలకు అందించాలని జనంలో నుండి వస్తున్న వ్యక్తి పవన్. ఆ వ్యక్తి మీద మీరు ఎన్ని గోబెల్స్ ప్రచారం చేసినా కుదరదు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియ చాలా యాక్టివ్‌గా ఉంది. సాక్షి పేపర్‌లో రాశారు. పవన్ సర్దుబాట్లు చేసుకుంటున్నారు అని.. రేపు ఇంకొకరు రాస్తారు. అంతకు ముందు చంద్రబాబు కూడా ఇదే కామెంట్స్ చేశారు. కామన్స్ సెన్స్ లేకుండా వార్త ఎలా రాస్తారు. ఒకవేళ రాస్తే... కొంచెం బెటర్‌గా రాయొచ్చు కదా.. మరీ 25 సీట్లకి, 3 ఎంపీ సీట్లకు ఎలా సెట్ అయిపోతాడు. తనకి సీట్లే కావలి అనుకుంటే 2014లోనే తీసుకునేవాడు కదా.. అప్పుడు ఛాయిస్ లేదు. అప్పుడు మంచి వాడు చెడ్డవాడు అనే ఆప్షన్ లేదు. చెడ్డ వాడు బాగా చెడ్డవాడు అనే ఆప్షన్స్ మాత్రమే ఉండటంతో చంద్రబాబుకి సపోర్ట్ చేశారు.మీరు మమ్మల్ని ఎంత తొక్కాలని చూసినా.. సోషల్ మీడియా వేదిక దొరికింది. మీరు ఎంత గోబెల్ ప్రచారం చేసినా.. నీచానికి దిగజారినా జనం గుండెల్లో ఉన్న జనసేన, పవన్ కళ్యాణ్‌ను ఏం చేయలేరు. తాత్కాలికంగా ఇలాంటి వార్తలు రాసి విజయం సాధించినా దీర్ఘకాలంలో ఇవి సాగవు. గాజు గ్లాసు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. దాహం వేస్తే అందులో నీరు పోసుకుని దాహం తీర్చుకోవచ్చు. ఆ గ్లాసును మనం కాపాడుకోవడం మన ధర్మం. మనకే మంచిది కూడా. గ్లాసు తన, పర, మంచి వాడు, చెడ్డవాడు అనే బేధం చూపించదు. ఇతడు ప్రతి పక్షం, అధికార పక్షం అనే ఆలోచన దానికి ఉండదు. అందరి దాహాన్ని చక్కగా తీరుస్తుంది. అందరికీ ఉపయోగపడుతుంది. ఒక వేళ మీరు గ్లాసుని పగలగొట్టాలని చూసినా.. ఒకవేళ గ్లాసు పగిలినా.. ఆ గ్లాసు గాజుపెంకు ఆయుధంగా మారి పీకలు కోసే అవకాశం ఉంది. బీ కేర్ ఫుల్... అనధికార జనసైనికుడు, మెగాబ్రదర్ నాగబాబు ‘అంతా నా ఇష్టం’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక నాగబాబు చెప్పాల్సిందంతా చెప్పేసి.. ‘ఇప్పటి వరకూ.. ‘అంతా నా ఇష్టం’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను చేసిన వీడియోలకు, చేయబోయే వీడియోలకు పవన్ కళ్యాణ్‌కి గాని.. జనసేన పార్టీకి కాని ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం నా సొంత బాధ్యత మాత్రమే’ అంటున్నారు.