YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇంటెలిజెన్స్ వైఫల్యమే పుల్వామా ఘటనకు కారణం

ఇంటెలిజెన్స్ వైఫల్యమే  పుల్వామా ఘటనకు కారణం
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:       
జమ్మూ కాశ్మీర్ లో పాలన కేంద్రం చేతిలో ఉందని, పుల్వామా ఘటనకు ప్రధాన మంత్రి నరేంధ్రమోదీ బాధ్యత వహించాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఉండవల్లి సీఎం నివాసం వద్ద జరిగిన మీడియా సమావేశంలో విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ, పీడీపీ కలసి ప్రభుత్వ ఏర్పాటు చేశాయని ఆయన గుర్తు చేశారు. పీడీపీ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించి అక్కడ గవర్నర్ పాలన పెట్టారని అందువల్ల పాలన మొత్తం కేంద్రం కనుసన్నల్లో నడుస్తోందని జయదేవ్ గుర్తుచేశారు. పుల్వామా ఘటన అనేది ఒక రోజులో ప్రణాళిక చేసింది కానది, ఇలాంటి పెద్ద ఘటనకు కొన్ని వారాలపాటు ప్రణాళిక చేసి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డాయి. ఈ ఉగ్రవాద చర్యలను పసిగట్టడంలో కేంద్ర ఇంటిలిజెన్స్ విఫలం అయిందని ఆయన ధ్వజమెత్తారు. 2013 లో ఉగ్రవాదుల దాడులు జరిగితే అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను రాజీనామా చేయాలని కోరారని, ఇప్పుడూ మేమూ అదే డిమాండ్ చేస్తున్నామన్నారు.  పుల్వామా ఘటన 3.10 నిమిషాలకు జరిగిందని, ఆ సమయంలో ప్రధాని జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో ఒక ప్రకటన షూటింగ్ లో ఉన్నారని, ఘటన జరిగిన  మూడున్నర గంటల తరవాత వరకూ  పీఎం మోదీ స్పందించలేదని జయదేవ్ గుర్తుచేశారు. ఘటన గురించి ప్రధానికి తెలియదా? అని జయదేవ్ అనుమానం వ్యక్తం చేశారు. పుల్వామా ఘటన అనంతరం ఢిల్లీలో జరిగిన అన్ని పార్టీల సమావేశానికి కూడా ప్రధాని హాజరుకాకపోవడాన్ని జయదేవ్ తప్పుపట్టారు. కేంద్ర ఇంటెలిజన్స్ వైఫల్యంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రధానిని ప్రశ్నిస్తే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మన సీఎంకు పాకిస్థాన్ ప్రధాని అంటేనే మక్కువని విమర్శలు చేయడం దారుణమని జయదేవ్ తప్పుపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కాశ్మీర్ భూమి కావాలి, కానీ అక్కడ జనంతో పనిలేదని ఎంపీ దుయ్యబట్టారు. జనవరిలో అమెరికా ఇంటిలిజెన్స్ సంస్థ వెల్లడించినట్టు మత సామరస్యం దెబ్బతినేవిధంగా గొడవలు, తీవ్రవాద ఘటనలు జరుగుతున్నాయని ఆయన గుర్తుచేశారు. 

Related Posts