YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సీఎంఆర్ ఎఫ్ చెక్కులు అందించిన ఎంపీ

సీఎంఆర్ ఎఫ్ చెక్కులు అందించిన ఎంపీ
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:       
పేదల కష్టాలతీర్చే ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు ఒక్కడే నని ఏలూరు ఎంపి  మాగంటి బాబు చెప్పారు. శనివారం ఉదయం  మాగంటి బాబు క్యాంపు ఆఫీసులో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలనుండి వినతులు  బాబు స్వీకరించారు. ఈ సందర్భంగా 24 మంది లబ్దిదారులకు రు.8,39,160 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన అందజేశారు. 7 నియోజక వర్గాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆయన వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల పెన్నిదిగా అనేక కార్యక్రమాలు చేపట్టిన అమలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కోట్లాధి రూపాయలు ఖర్చు చేసి అనేక కుటుంబాలను ఆదుకోవడం జరిగిందన్నారు. లబ్దిపొందిన ప్రతి ఒక్కరూ  చంద్రబాబు సహకారం మరచిపోకుండా ఆవిషయం అందరికీ చెప్పాలని, అందరి సహకారంతో  చంద్రబాబు ని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని  బాబు కోరారు. 

Related Posts