YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మహానాయకుడు బాక్సాఫీసు దగ్గర బోల్తా

 మహానాయకుడు బాక్సాఫీసు దగ్గర బోల్తా
యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:   
అందరూ ఊహించిన‌ట్లుగానే ‘ఎన్టీఆర్ ...మ‌హానాయ‌కుడు’ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దారుణమైన ఓపినింగ్స్ తో మొదలైంది. గతంలో  బాల‌య్య నటించిన ఏ సినిమా కూడా ఇంత తక్కువ ఓపినింగ్స్ రాలేదు.  అంతెందుకు ఈ చిత్రం తొలి భాగం క‌థానాయ‌కుడులో సగం కూడా రాకుండా   దారుణంగా దిగ‌జారిపోయాయి క‌లెక్ష‌న్లు. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు కేవలం కోటి రూపాయలు(ఇది కేవలం ఎస్టిమేషనే..ఫెరఫెక్ట్ ఫిగర్ కాదు) మాత్రమే తొలి రోజు వచ్చినట్లు తెలుస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ ఆఫీసర్ చిత్రమే  రిలీజ్ రోజు అతి తక్కువ కలెక్ట్ చేసిన రికార్డ్ ఉంది. ఆ రికార్డ్ ని మహానాయకుడు బ్రద్దలు కొట్టిందంటున్నారు. ఆర్టిసి క్రాస్ రోడ్ లో మహానాయకుడు చిత్రం మొదటి రోజు  1,60,641 గ్రాస్ వస్తే..అదే రామ్ గోపాల్ వర్మ ఆఫీసర్ అదే ప్లేస్ లో 3,44,718 వచ్చింది. ఆఫీసర్ గ్రాస్ లో సగం కూడా ఎన్టీఆర్ బయోపిక్ కలెక్ట్ చేయకపోవటం దారుణం అంటున్నారు.  తెలుగుదేశం అభిమానులు కానీ, బాలయ్య వీరాభిమానులు కానీ ఈ సినిమాని పట్టించుకున్నట్లు కనపడటం లేదని ఈ కలెక్షన్స్ తేలినట్లైంది. ఇక ఈ చిత్రం తొలి భాగం క‌థానాయ‌కుడు సినిమా 50 కోట్ల వ‌ర‌కు న‌ష్టాలు నిర్మాతలకు తీసుకొచ్చింది. కానీ  మ‌హానాయ‌కుడు ఆ న‌ష్టాలను భ‌ర్తీ చేయ‌డం మాట అటుంచి  కొత్త న‌ష్టాలు తీసుకొస్తుందనే నిర్ణయానికి వచ్చేసారు డిస్ట్రిబ్యూటర్స్.  దాంతో నష్ట పరిహారం కోసం మళ్లీ వివాదం ప్రారంభం అయ్యేటట్లు ఉంది అంటున్నారు.

Related Posts