ఏపీ ప్రత్యేక హోదా భరోసా యాత్ర మార్చి 3 వరకు కొసాగుతుందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తిరుపతి వేదికకగా రాహుల్ ఇచ్చిన భరోసా ఏపీ ప్రజలకు వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను రాహుల్ గాంధీ జాతీయ అజెండాగా చేస్తారని, ప్రధాని కాగానే తొలి సంతకం పెడతారని అన్నారు. ఏపీకి ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుతామని రఘువీరా స్పష్టం చేశారు.ఆంధ్రలో యువతకు ఉపాది ప్రత్యేక హోదాతోనే సాద్యమని చెప్పిన ఆయన రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిన అవసరం ఉందని అన్నారు.కేవలం గంట 45 నిమిషాల్లో కాలినడకన తిరుమలకు చేరుకున్న రాహుల్ ఎనర్జీ ఎంతో ఆంధ్రాప్రజలకు తెలిసిందని చెప్పారు.రాహుల్ గాందీ పర్యాటన ఏపీలో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపిందని అన్నారు.