ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.సత్యనారాయణ హెచ్చరించారు. నేటినుంచి మూడు రోజులపాటు జరుగనున్న ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉల్చాలలోని పోలింగ్ కేంద్రం నెంబర్ 115, 116, 117, 118, 122, నాగలాపురం పి.ఎస్.నెంబర్ 210, 211, కోడుమూరులో 235 పోలింగ్ కేంద్రం, గోనెగండ్ల మండలం వేముగోడులో 218, 219 పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి బిఎలీవోల వద్ద ఉన్న ఓటరు జాబితా, కొత్తగా ఓటు నమోదు చేసుకుంటున్న వారి ఫారం 6 ను క్షుణ్ణంగా కలెక్టర్ తనిఖీ చేసి పలు సూచనలు జారీచేశారు. పేర్లు, చిరునామాలు, ఫోటోలు ఒకే విధంగా ఉన్న దేమోగ్రఫికెల్ సిమిలర్ ఎంట్రీస్ ను ఫారం 7 ఉపయోగించి సంభందించిన వారి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని తొలగించాలన్నారు. కోడుమూరు లో ఫారం 7 బిఎల్ ఓ లకు ఇవ్వని కారణంగా కోడుమూరు డిప్యూటీ తహసిల్దార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే మెమో ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా ఉల్చాల పోలింగ్ కేంద్రం 117 లో దేమోగ్రఫికెల్ సిమిలర్ ఎంట్రీస్ విచారణ చేయకుండా పెండింగులో ఉంచుకున్న బిఎల్వీఓ పై ఆగ్రహం వ్యక్తంచేస్తూ, ఈ రోజై సాయంత్రం లోపు పూర్తి చేయకపోతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించక పోతే ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆయా మండలంలోని పోలింగ్ కేంద్రం వెలుపల ఉన్న ప్రజలతో కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలన్నారు. ఓటు లేక పోతే వెంటనే నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేసారు. మధ్యాహ్న భోజనం బాగుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మంత్రాలయం మండలం కల్లుదేవ కుంట గ్రామ పంచాయతీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఇక్కడ ఆన్ లైన్ ద్వారా ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి, వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామంలో పర్యటిస్తూ ఈవీఎం, వివి ప్యాట్స్ ద్వారా తమ ఓటును ఎలా వేయాలో అధికారులు మీకు అవగాహన కల్పించారా అని గ్రామస్తులను అడుగగా, అధికారులు అవగాహన కల్పించారని గ్రామస్తులు కలెక్టర్ కు విన్నవించారు. భారత ఎన్నికల సంఘం 1950 టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసిందని ఓటు వివరాలను తెలుసుకునేందుకు జిల్లా వాసులు 08558 - 1950 ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఆర్డీవో రామమూర్తి, సంబంధిత తహశీల్దార్లు, సెక్టోరల్ అధికారులు, ఎస్.హెచ్ వోలు, బిఎల్వోలు తదితరుల పాల్గొన్నారు.