YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఫిబ్రవరి 25న అవార్డుల పండగ

ఫిబ్రవరి 25న అవార్డుల పండగ

హాలీవుడ్ సినిమా పండగగా అభివర్ణించే ఆస్కార్ అవార్డుల కోసం ప్రపంచ దేశాలన్నీ అమితమైన ఆసక్తితో ఎదురుచూస్తుంటాయి. జీవితంలో ఒక్కసారన్నా ఆస్కార్ అవార్డు అందుకుంటే ఇంక సాధించాల్సిందేమీ ఉండదని సినీ ప్రముఖులు భావిస్తుంటారు. భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 25 ఉదయం 91వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. ఈ అవార్డులను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ ప్రతి ఏటా హాలీవుడ్ లో ప్రదానం చేస్తుంది. ఈసారి ఉత్తమచిత్రం రేసులో బ్లాక్ పాంథర్, వైస్, రోమా, బొహేమియన్ రాప్సొడీ, ఏ స్టార్ ఈజ్ బోర్న్ తదితర చిత్రాలు నిలిచాయి. 

Related Posts