యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాజకీయాలు ఎటు నుంచి ఎటు మళ్లుతాయో ఎవ్వరూ ఊహించలేరు. అధికారం అనేది బంధుత్వాన్ని కూడా పక్కన బెట్టేస్తుందని ఇప్పటికే రాజకీయ చరిత్రలో చాలా ఆధారాలున్నాయి. కొన్ని సందర్భాలు ఒక్కసారిగా ఊహించని పెను మార్పులకు బాటలు వేస్తాయి. ప్రస్తుతం వైఎస్ ఫ్యామిలీ జరుగుతున్న ముసలం టీడీపీకి అంతులేని బలం చేకురచనుందా? అనే కోణంలో ఊహాగానాలు మొదలయ్యాయి.గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తున్న జగన్.. కొంతకాలంగా కడప జిల్లా టిక్కెట్ల గురించి అస్సలు ప్రస్తావించటం లేదు. ఒకటి, రెండు సీట్లు మినహా మిగతా చోట్ల అభ్యర్థుల గురించి పెద్దగా పట్టించుకోవటం లేదు. అవినాష్ రెడ్డికి మళ్లీ ఎంపీ సీటు ఇవ్వడం లేదని మొదటగా ప్రచారం చేసిన జగన్.. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. దీంతో వైఎస్ భారతి, షర్మిల ఇంటి పోరు ఎక్కువైందా? ఇందులో వైఎస్ వివేకానందరెడ్డి చక్రం తిప్పుతున్నారా? అనే అనుమానాలు తెరపైకి వచ్చేశాయి. వైఎస్ వివేకా టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లటంతో ఏపీ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో.. యెడుగూరి సందింటి కుటుంబంలో కల్లోలం రేగిందని, ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు చేయాల్సిన రాజకీయం అంతా చేస్తున్నారని మీడియా కథనాలు మొదలయ్యాయి.గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించడానికి వైఎస్ బామ్మర్ది, వైఎస్ విజయమ్మ సోదరుడు, కమలాపురం ఎమ్మెల్యే రవీంధ్రనాథ్ రెడ్డి ప్రయత్నించారు. ఆయన వర్గానికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఓట్లను బీటెక్ రవికి వేయించారు. దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించిన వైఎస్ వివేకానందరెడ్డి.. వాటిని జగన్ ముందు పెట్టి తనకు న్యాయం చేయాలని, అదేవిధంగా కడప పార్లమెంట్ సీటు మొదటి నుంచి తనదే కాబట్టి దానిని తనకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అలా కుదరకపోతే కమలాపురం అసెంబ్లీ స్థానమైనా ఇవ్వాలని ఆయన అంటున్నారు. అదే జరగక పోతే ఆయన టీడీపీలోకి పోతానని తేల్చి చెప్పేశారట. కాగా వివేకా పై పోటీకి దిగాలని వైసీపీ వర్గాల నుంచే వైఎస్ భారతిపై ఒత్తిడి పెరుగుతోందట. మరో వైపు షర్మిల కూడా రంగంలోకి దిగారు. లోలోపల ఆమెకు వైఎస్ భారతికి మధ్య పడటం లేదు. వైసీపీ సొంత మీడియాలో షర్మిల పేరు కూడా రాకపోవడానికి కూడా అదే కారణం అంటున్నారు రాజాకీయ విశ్లేషకులు.తనకు సీటు తేల్చకపోతే రచ్చకెక్కడానికి సిద్ధమంటున్నారట షర్మిల. ఇవన్నీ జగన్ ని చిక్కుల్లో పడేశాయని, యెలాంటి సందర్భాల్లో జగన్ సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముందని టాక్ నడుస్తోంది.