YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మండే సూరీడు

మండే సూరీడు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:   

మొన్నటి వరకు చలితో వణికి పోయిన నగరం ప్రస్తుతం ఎండ తీవ్రతకు భానుడు నిప్పులు కక్కుతున్నాడు. చలికాలం ఇలా ముగిసిందో లేదో, భానుడు భగభగ మండిపోతున్నాడు. ఉష్ణోగ్రతలు పెరిగి రాష్ట్ర జనాభాకి ధడ పుట్టిస్తోంది. ఈ ఏడాది ఎండలు ఎక్కువ గా ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. అన్నట్లుగానే వేసవికి ముందుగానే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం తో మున్ముందు ఏ స్థాయిలో ఎండలు ఉంటాయోనని భయమేస్తోంది. ప్రస్తుతం దంచ్చి కొడుతున్న ఎండలకు జనం అల్లాడుతున్నారు. ఉదయం తొమ్మిది దటక ముందే భానుడి భగభగలకు ప్రజలు భయపడిపోతున్నారు. ఫ్యాన్లు,కూలర్‌లకు పనిచెప్పడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. తెలంగాణలోని జిల్లాలు, పట్టణాలు  ప్రాంతాల్లో పండ్ల రసాల దుఖాణాలు వెలిసాయి. కొబ్బరి బోండాలకు గిరాకి రెట్టింపయ్యింది. చెరువులు, ప్రాజెక్టుల్లోని నీళ్లు వేగంగా ఆవిరైపోతున్నాయి. ఫిబ్రవరిలోనే ఎండలు ఇలా ఉంటే మార్చి, ఎప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉంటె వడదెబ్బ బారి నుంచి తప్పించుకోవచ్చు. నీళ్లు అధికంగా తాగడం ,పండ్లరసాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. చిన్నారులు డిహైడ్రేషన్ కు గురైయ్యే అవకాశం ఉందని వారి విషయంలో ముందు జాగ్రత్త తీసుకోవలని వైద్యులు సూచిస్తున్నారు.సూర్యుడు కర్కటకరేఖ మీదుగా ఉండగా, ప్రస్తుతం భూమద్య రేఖవైపు వస్తుండడం వల్ల ఎండల తీవ్రత పెరుగుతోందని వాతవరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అదే విధంగా నిర్మల్ జిల్ల భౌగోలికంగా ఎత్తయిన ప్రాంతంలో ఉండడంతో సూర్యుని కిరణాలు అతి త్వరగా నిలువుగా చేరడంతో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుందన్నారు. ఇటు ఓజోన్ పొర క్షీణించడం కూడా ఎండల తీవ్రత పెరగడం, అతినీలలోహిత కిరణాలు భూమిపై పగతాయని వాతవరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Related Posts