YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కనకదుర్గను దర్శించుకున్న మంత్రి సునీత

కనకదుర్గను దర్శించుకున్న మంత్రి సునీత

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:   

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను వెంకటాపురం గ్రామస్తులతో కలిసి అమ్మవారిని మంత్రి పరిటాల సునీత సోమవారం ఉదయం  దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రాంతాన్ని చూసేందుకు మా గ్రామస్తులు వచ్చారని అన్నారు.  అమరావతిలో ఇటుక కూడ వేయలేదని ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ అమరావతిని చూడాలని, ఇక్కడ జరిగే అభివృద్ధిని తెలుసుకోవాలని ఆమె సూచించారు. 
2019 లో మళ్లీ రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమే.  ఆంధ్రప్రదేశ్ కు రెండవసారి చంద్రబాబు నాయుడు  ముఖ్యమంత్రి కావడం తధ్యమని అమె అన్నారు.  రాష్ట్రం అభివృద్ధి జరగాలన్న, పోలవరం పూర్తి కావాలన్న, అమరావతి నిర్మాణం జరగాలన్న మళ్లీ చంద్రబాబు నాయుడు  ముఖ్యమంత్రి కావాలి. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రన్న తిరిగి సి.ఎం కావాలని అన్నారు.  దుర్గమ్మ ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు  మళ్లీ ముఖ్యమంత్రి అవడం తధ్యమని అన్నారు.

Related Posts