YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పోలవరానికి కేంద్రం బకాయిలు నాలుగు వేల కోట్లు

పోలవరానికి కేంద్రం బకాయిలు నాలుగు వేల కోట్లు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

జాతీయ జల అవార్డులలో ఉత్తమ రాష్ట్రం విభాగంలో ఆంధ్రప్రదేశ్ కు మూడో స్థానం దక్కడంపై జలవనరుల శాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిసారు. సోమవారం అయన పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ ఇప్పటివరకు 66.36%  పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని అన్నారు. కాంక్రీట్ పనులు 65.30%, మొత్తం 38.88 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకు గాను 25.37 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయని అన్నారు. తవ్వకం పనులు 82.60%, మొత్తం 1115.59 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకం పనులకు గాను 966.19 క్యూబిక్ మీటర్ల వరకు పనులు పూర్తయ్యయని అన్నారు. కుడి ప్రధాన కాలువ 90.29%, ఎడమ ప్రధాన కాలువ 68.74%, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 62.83%, ఎగువ కాఫర్ డ్యామ్ పనులు 25.73% ,  దిగువ కాఫర్ డ్యామ్ పనులు 10.17% పూర్తి  అయింది. గతవారం స్పిల్ వే, స్పిల్ చానల్, పైలట్ చానల్, అప్రోచ్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్కు సంబంధించి 3.89 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు అయ్యాయి. గతవారం స్పిల్ వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్కు సంబంధించి 56 వేల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు పూర్తి అయితే,  ఇప్పటివరకు జరిగిన పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి రాష్ట్రానికి రూ.4,063 కోట్లు  కేంద్రం బకాయి పడిందని అయన అన్నారు.

Related Posts