యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తుగ్గలి మండలం ను కరువు మండలంగా ప్రకటించాలని పత్తికొండ వైసీపీ ఇన్ చార్జ్ శ్రీదేవి తమ కార్యకర్తలతో ర్యాలీని నిర్వహించారు. మండల కేంద్రమైన తుగ్గలిలో మొదటగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, రైతుల కొరకు తుగ్గలి మండలంను కరువు మండలంగా ప్రకటించాలని ధర్నా నిర్వహించారు. తుగ్గలి మండలం కరువు మండలంగా వెంటనే ప్రకటించాలని, రబీలో వేసిన పంటలకు ప్రభుత్వం వెంటనే కరువును ప్రకటించాలని తాహసిల్దార్ కార్యాలయం వద్ద రోడ్డు దిగ్బంధం చేసారు. ఈ ధర్నా వైఎస్ఆర్ విగ్రహం నుంచి మొదలుకొని తహసిల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తుగ్గలి మండలంను కరువు మండలంగా ప్రకటించాలని సీనియర్ అసిస్టెంట్ సుదర్శన్, ఆర్ఐ మధుసూదన్ కు మెమోరాండంను సమర్పించారు.ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి మాట్లాడుతూ వైయస్సార్ ప్రభుత్వంతోనే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని,ప్రతి ఏటా పంటలు వేసే ముందు ప్రతి ఒక్క రైతు ఖతాలో 12,500 రూపాయలు జమ అవుతాయని ఆమె తెలియజేశారు.ఈ ధర్నాకు వామపక్ష నాయకులు నబి రసూల్, సుల్తాన్ మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జిట్టా నాగేష్, సింగిల్ విండో ప్రెసిడెంట్ ప్రహల్లాద రెడ్డి, పగిడిరాయి జగన్నాథరెడ్డి, పత్తికొండ రామచంద్ర,శ్రీరంగడు, తుగ్గలి మోహన్ హనుమంతు, మురళి, వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.