YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మరో అవార్డును అందుకున్న కలెక్టర్

 మరో అవార్డును అందుకున్న కలెక్టర్
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:   
కర్నూలు:  కర్నూలు జిల్లాలో భూగర్భజలాల వృద్ధికి విశేష కృషి చేసిన జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ జాతీయ స్థాయిలో మరో అవార్డును అందుకున్నారు. సోమవారం న్యూ ఢిల్లీ లోని కాన్ స్టిట్యూషనల్ క్లబ్, మౌళలంకర్ భవన్ లో కేంద్ర వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్, గంగా రెజ్యూవెనషన్, హైవేస్ మంత్రి నితిన్ గడ్కరీ, సహాయ మంత్రులు అర్జున్ రాం మేఘావ్వాల్, డా. సత్యపాల్ సింగ్ చేతులమీదుగా నేషనల్ వాటర్ అవార్డును జిల్లా కలెక్టర్ అందుకున్నారు. నంద్యాల ప్రాంతంలోని కుందూ నదిని పునరుద్ధరించి భూగర్భజలాలను అభివృద్ధి చేసినందుకు దక్షిణ భారతదేశంలోనే కర్నూలు జిల్లాకు ప్రథమ స్థానం లభించింది. కుందూ నదిని పునరుద్ధరించక ముందు 40 -60 రోజులు నీటి పారుదల రోజులుండగా, నీరు చెట్టు పనులతో నదిని పునరుద్ధరించిన తరువాత 90 - 120 రోజుల వరకు నీటి పారుదల పెరిగిందన్నారు. అలాగే 17,000 పంట కుంటలు నిర్మించడం జరిగిందన్నారు. సోమశిలకు 15 టీఎంసీల నీటిని ఇవ్వడం సులభమైందన్నారు. 21 లైఫ్తుల ద్వారా 12500 ఎకరాలకు నీటిని ఇవ్వడంతో దాదాపు 250 బోర్లు రీఛార్జ్ అయ్యి భూగర్భజలాలు వృద్ధి చెందాయన్నారు. గ్రౌండ్ వాటర్, డ్వామా, జలవనరుల శాఖల సంయుక్త కృషితో ఈ అవార్డు దక్కిందని, మిగిలిన శాఖలు ఇదే స్ఫూర్తితో పని చేసి జిల్లాకు మరిన్ని అవార్డులు సాధించాలన్నారు.  ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జలవనరుల శాఖ సి.ఈ నారాయణ రెడ్డి, ద్వామ పీడి.వెంకట సుబ్బయ్య, గ్రౌండ్ వాటర్ డిడి రఘురాం పాల్గొన్నారు.  

Related Posts