యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని భావించిన వైసీపీకి చెందిన యువత 150 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభపరిణామమని కాంగ్రెస్ నాయకులు భైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.స్థానిక పద్మావతి నగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం భైరెడ్డి సమక్షంలో పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఫయాజ్, షేక్ ఫారూఖ్ అబ్దుల్లా, రహిమాన్ ఆధ్వర్యంలో 150 మంది వైస్సార్సీపీ ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా భైరెడ్డి మాట్లాడుతూ మోది ప్రభుత్వ విధానాలపై యువత విసుగు చెందిందని అన్నారు.ఉద్యోగాలు రాక 37 లక్షల మంది నిరుద్యోగులగా ఉన్నారన్నారు.నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు.ప్రత్యేక హోదా ఇవ్వక ప్రజలను మొసంచేసారన్నారు.ఆయన విదానాలు ఎవ్వరికి అర్తం కావటం లేదన్నారు.ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు.యువతను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.ఈసందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ తిరుపతి లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ,నంద్యాలలో పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి బస్సు యాత్రలలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానం,ప్రత్యేక హోదా వీరితోనే సాద్యం అవుతుందనే నమ్మకంతో సలి.నగర్ గుడిపాటి గడ్డ,చాంద్ బాడా,పఠాన్ పేట,విసి కాలనీ,మూలాన్ పేట తదితర ప్రాంతాలకు చెందిన వారం పార్టీలో చేరమన్నారు.యువతకు కాంగ్రెస్ పార్టీలోని న్యాయం జరుగుతుందన్నారు.పార్టీలో ఫిరోజ్,ఇంతియాజ్,అబీద్, రియాజ్,ఇలియాస్, వాహిద్ లతో పాటు 150 మందిచేరారని తెలిపారు