YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం

 నిద్రించే 'భంగమే' నిదర్శనం

Highlights

  •  భాగ‌స్వామితో మీ అనుబంధానికి ప్రతీక
  • ప‌డుకునే అల‌వాట్ల‌పైన ఒక అధ్యాయనం
 నిద్రించే 'భంగమే' నిదర్శనం

 ప‌డుకునే విధానాన్ని బ‌ట్టి మీ భాగ‌స్వామితో మీకున్న అనుబంధం గురించి చాలా విష‌యాలు తెలుస్తాయంట, ఈ విషయం మీకు తెలుసా.. ఇటీవల ఒక ఆన్‌లైన్ సంస్థ ప‌రుపుల నాణ్య‌తపై స‌ర్వే నిర్వహించినది. ఆ సర్వే లో  నిద్రించే అల‌వాట్ల‌పైన ఒక అధ్యాయనం  చేసింది. ఈ సర్వేలో  దాదాపు 1000 మంది పాలుపంచుకున్నారు. వారంతా  18 నుంచి 73ఏళ్ల మ‌ధ్య‌లోని వాళ్ళే. ఆయా వయసుల వారి నిద్ర అల‌వాట్లు మొత్తంగా ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను చేకూర్చినా ఒక అంశం మాత్రం చాలా ఆశ్చ‌ర్యం క‌లిగించింది. భాగ‌స్వామితో సెక్స్‌లో సంతృప్తి క‌లిగించేందుకు ఏ భంగిమ‌లో నిద్రిస్తే ఎక్కువ‌గా ఉప‌యోగ‌డ‌ప‌డుతుంద‌నే విష‌యంపైన స‌ర్వే జ‌రిగింది. 
ఆయా భంగిమల ప్రభావాలు ఎలాఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం..

వెన‌క వైపు హ‌త్తుకొని ప‌డుకోవ‌డం వ‌ల్ల శృంగార భావ‌న‌లు పెరుగుతాయ‌ట‌. ఇలా ప‌డుకోవ‌డం వ‌ల్ల ఒక‌రితో మ‌రొక‌రికి క‌లిసేందుకు చాలా సులువ‌వుతుంది అని చెప్పారు.

గుండెల‌కు హ‌త్తుకొని నిద్రించే భంగిమ‌లో మ‌గ‌వాడి ఛాతీపై ఆడ‌వారు త‌ల ఉంచుతారు. మ‌గ‌వాడు త‌న చేతుల‌ను అమ్మాయి మెడ‌పై ఉంచుతాడు. ఇద్ద‌రి మ‌ధ్య రొమాంటిక్ ఫీలింగ్ క‌లుగుతుంది. ప్రియుడి గుండెచ‌ప్పుడు ప్రియురాలు స్ప‌ష్టంగా విన‌గ‌లుగుతుంది. ఇలాంటి భంగిమ‌లో ప‌డుకునేవారు చాలా రొమాంటిక్ ప్రేమ‌లో మునిగితేలుతారంట.

 ఎప్పుడైనా మీ భాగ‌స్వామితో వేలాడుకున్న‌ట్టు ప‌డుకున్నారా? చాలా మంది క‌నీసం ఒక్క‌సారైనా ఇలా ట్రై చేసి ఉంటారు. ఇది చాలా క్యూట్‌గా అనిపిస్తుంద‌ట‌. దీనికి 3.5 రేటింగ్ ఇచ్చారు. సెక్స్ కు ఇది చాలా అనుకూల‌మైన భంగిమ. ఇది అంత‌గా రొమాంటిక్ విధానం కాక‌పోయినా కొత్త‌గా ట్రై చేయాల‌నుకుంటే ప్ర‌య‌త్నించొచ్చు అంటున్నారు నిపుణులు.

ఇక పొతే.. ఎదురెదురుగా మొహాల‌ను చూస్తూ ప‌డుకునేవారు సెక్స్‌లో అద్భుతమైన అనుభ‌వాన్ని పొందుతున్నార‌ట‌. ఒక‌రిపై మ‌రొక‌రు కాళ్లు వేసి ప‌డుకోవ‌డం వ‌ల్ల మ‌రింత శృంగార అనుభ‌వాన్ని పొంద‌గ‌లుగుతున్నారట‌. దీనికి మొద‌టి ర్యాంకు రావ‌డం పెద్ద‌గా ఆశ్చ‌ర్యం క‌లిగించ‌దు ఎందుకంటే భాగ‌స్వామి క‌ళ్ల‌లోకి చూస్తూ చేయ‌డం మ‌రింత మ‌జానిస్తుంద‌ట‌.
 

Related Posts