యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
పాక్ ఆక్రమిత కశ్మీర్లోని జైషే ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజామున భారత వాయుసేన సర్జికల్ స్ట్రైక్-2 జరిపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాల జవాన్లకు సెలవులు రద్దు చేసింది. పాక్ నుంచి ప్రతీకార దాడులు ఉంటాయనే అనుమానంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, భారత సరిహద్దు మొత్తాన్ని సైన్యం తమ ఆధీనంలోకి తీసుకుంది. ప్రస్తుతం పాక్-భారత్ సరిహద్దులో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.