యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ కేటాయించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. వాల్తేరు, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు కలిపి విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్‌ను కేటాయించాలని అందులో కోరారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, గత నాలుగున్నరేళ్లుగా రైల్వే జోన్ ఏర్పాటు కాలేదు. వాల్తేరు డివిజన్ ప్రస్తుతం ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో ఉంది. వాల్తేరు డివిజన్‌ను వదులుకోవడానికి ఒడిశా సిద్ధంగా లేదు. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వాల్తేరు డివిజన్ మీద ఈస్ట్‌కోస్ట్ రైల్వే పట్టుబట్టడంతో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ఆలస్యం అవుతోంది. మార్చి ఒకటో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో పర్యటిస్తున్నారు. నగరంలో జరిగే ఓ సభలో పాల్గొంటారు. ఆ రోజు విశాఖ రైల్వే జోన్‌ను ప్రకటిస్తారంటూ ప్రచారం జరుగుతోంది.విశాఖపట్నానికి రైల్వే జోన్ కేటాయించాలంటూ ఇటీవల ఏపీ బీజేపీ నేతలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మరికొందరు నేతలు కలసి పీయూష్‌గోయల్‌కు వినతిపత్రం సమర్పించార