Highlights
- చైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు
- చైర్మన్ గా వేమూరి ఆనంద సూర్య..?
ఆంధ్ర ప్రదేశ్ అర్చక ఉద్యోగుల సంస్థ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ను తొలగిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 2014 నుంచి 16వరకు ఏపీకి సీఎస్‌గా వ్యవహరించిన ఐవైఆర్ కృష్ణారావు ఆ తరువాత టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు, సీనియర్ ఎన్టీఆర్, లోకేశ్‌లపై సోషల్ మీడియాలో పలు విమర్శలు చేశాడు. ఈ నేపథ్యంలో మొదట బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి ఆయనను తొలగించింది. తాజాగా ఏపీ అర్చక ఉద్యోగుల సంస్థ చైర్మన్ పదవి నుంచి కూడా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అతడి స్థానంలో వేమూరి ఆనంద సూర్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.