YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పాక్‌ అదుపులో వింగ్‌ కమాండర్‌ విక్రమ్‌..?

 పాక్‌ అదుపులో వింగ్‌ కమాండర్‌ విక్రమ్‌..?
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:   
తమ‌ భూభాగంలో కూల్చేసిన విమానంలో ఉన్న పైలట్‌ను అదుపులోకి తీసుకొన్నట్లు పాక్‌ అధికారులు వెల్లడించారు. వింగ్‌ కమాండర్‌ విక్రమ్‌ అభినందన్‌ అనే పైలట్‌ ను అదుపులోకి తీసుకున్నట్లు పాక్‌ చెబుతోంది. ఈ వీడియోలోని వ్యక్తి భారత వాయుసేన దుస్తులను ధరించి ఉన్నాడు. తన పేరు వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ అని ఆ వ్యక్తి వెల్లడిస్తున్నాడు. అతని చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి.  అయితే భారత్‌కు చెందిన యుద్ధ విమానాలను కూల్చివేశామన్న పాక్‌ ప్రకటనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. భారత వాయుసేనకు చెందిన పైలెట్లు అందరూ సురక్షితంగానే ఉన్నట్లు రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి.భారత్‌కు చెందిన రెండు యుద్ధవిమానాలను కూల్చినట్లు పాకిస్థాన్‌కు ఇంటర్‌ సర్వీస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ డీజీ ఆసీఫ్‌ గఫూర్‌ వెల్లడించారు. పాక్‌ యుద్ధవిమానాలను వెంటాడుతూ నియంత్రణ రేఖను దాటిన రెండు భారత వాయుసేనకు చెందిన యుద్ధవిమానాలను కూల్చివేసినట్లు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. వీటిలో ఒక విమానాన్ని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో కూల్చేయగా.. మరో విమానాన్ని కశ్మీర్‌లో కూల్చివేసినట్లు పేర్కొన్నారు. భారత వాయుసేనకు చెందిన ఒక పైలట్‌ను అదుపులోకి తీసుకొన్నట్లు వెల్లడించారు.అంతకు ముందు రాజౌరీ సెక్టార్‌లో పాక్‌కు చెందిన యుద్ధివిమానాలు నియంత్రణ రేఖను దాటి వచ్చాయి. వీటిని భారత వాయుసేనకు విమానాలు వాటిని తిప్పికొట్టాయి. దీంతో కశ్మీర్‌లో పౌరవిమానాల రాకపోకలపై నిషేధం విధించారు.

Related Posts