YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

యుద్ధమా, శాంతా..72 గంటల్లో తేలుతుంది: పాక్‌

 యుద్ధమా, శాంతా..72 గంటల్లో తేలుతుంది: పాక్‌

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:   

తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు వేగంగా రెండు దాయాది దేశాల మధ్య యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకునేలా చేస్తున్నాయి. ఉగ్ర శిబిరాలపై భారత్ జరిపిన మెరుపుదాడులకు పాక్ కుతకుతలాడుతూ.. భారత్ మీద అన్యాయంగా వైమానిక దాడులు చేసే ప్రయత్నం చేసింది. అయితే.. ఈ చర్యను భారత వైమానిక దళాలు గట్టిగా తిప్పి కొట్టాయి.అదే సమయంలో భారత్ కు చెందిన రెండు యుద్ధ విమానాల్ని కూల్చేసినట్లుగా పాక్ తప్పుడు ప్రచారం చేస్తోంది. అయితే.. ఇందులోనిజం లేదని.. ఒక విమానం మాత్రం సాంకేతిక కారణాలతో కూలినట్లుగా భారత్ చెబుతోంది. మరోవైపు ప్రపంచ దేశాలు పాక్ తీరును తప్పు పడుతున్న వేళ.. పాక్ మంత్రి మాత్రం అందుకు భిన్నంగా భారీ హెచ్చరికలు చేస్తున్నారు.భారత్‌-పాకిస్థాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాగల 72 గంటలు అత్యంత కీలకమని పాక్‌ రైల్వే శాఖ మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. యుద్ధమా, శాంతా అనేది వచ్చే 72 గంటల్లో తేలిపోతుందని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ యుద్ధం వస్తే రెండో ప్రపంచ యుద్ధం కంటే పెద్దదిగా మారే అవకాశం ఉందని అన్నారు. భారత్‌-పాక్‌ మధ్య ఇదే అంతిమ యుద్ధం కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్‌ మంగళవారం సరిహద్దు ప్రాంతంలోని పాక్‌ భూభూగంలో ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా పాక్‌ యుద్ధ విమానాలు ఈరోజు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. అయితే భారత్‌ వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది.

Related Posts