YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు

అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు

Highlights

50 సిలిండర్లు,

2 ఫిల్లింగ్ మెషీన్ లతో పాటు ఇద్దరిని అదుపు

అక్రమ కార్యక్రమాలపై నిఘా

అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు

హుజురాబాద్ పట్టణ కేంద్రంగా అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు చేసి,50 సిలిండర్లు,2 ఫిల్లింగ్ మెషీన్ లతో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకొని,సివిల్ సప్లై అధికారులకు అప్పగించడం జరిగింది...

వివరాల్లోకి వెళ్తే...హుజురాబాద్ పట్టణానికి చెందిన మాడిశెట్టి చందు మరియు మంచికట్ల విజయ్ భాస్కర్ అను ఇద్దరు వ్యక్తులు గత 3 నుంచి 4 సంవత్సరాలుగా హుజురాబాద్ బస్ స్టాండ్ కేంద్రంగా చేసుకుని,అక్రమంగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను తీసుకొని వచ్చి,వాటిని తమ వద్ద గల మెషిన్ ల ద్వారా అక్రమంగా చిన్న చిన్న గ్యాస్ సిలిండర్లలోకి నింపుతూ,అధిక లాభాలు గడిస్తున్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ దాడి చేయగా,ఇట్టి ఇద్దరు వ్యక్తులు రెడ్ హ్యాండెడ్ గా టాస్క్ ఫోర్స్ కి పట్టుబడడం జరిగింది...ఇందులో మాడిశెట్టి చందు దగ్గర 35 సిలిండర్లు,1ఫిల్లింగ్ మెషీన్ మరియు మంచికట్ల విజయ భాస్కర్ వద్ద 15 సిలిండర్లు,1 ఫిల్లింగ్ మెషీన్ లను స్వాదీనం చేసుకున్నారు .

ఇట్టి సిలిండర్లు,మెషీన్ లతో యుక్తముగా ఇద్దరి వ్యక్తులను తదుపరి చట్ట ప్రకారమైన చర్యల నిమిత్తం సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు.

అక్రమ కార్యక్రమాలపై నిఘా ఉంది...: టాస్క్ ఫోర్స్...

హుజురాబాద్ పట్టణం తో పాటు,జిల్లాలోని అన్ని అక్రమ కార్యక్రమాలపై టాస్క్ ఫోర్స్ నిఘా ఉందని,ఇప్పటికైనా ఇలాంటి అక్రమ కార్యక్రమాలు నిర్వహించేవారు మానుకోవాలని లేకుంటే దాడులు ఇంకా తీవ్రతరం చేస్తామని ఈ సందర్బంగా టాస్క్ ఫోర్స్ అధికారులు హెచ్చరించారు...అలాగే ఈ సిలిండర్లు ఎవరు సప్లై చేస్తున్నారు, ఎలా వస్తున్నాయని దానిపై వివరాలు సేకరిస్తూన్నామని వారు తెలిపారు..

ఇట్టి దాడుల్లో టాస్క్ ఫోర్స్ సిఐలు శ్రీనివాసరావు,మాధవి,కిరణ్,ఎస్సై రమేష్,ఏఎస్సై నర్సయ్య,టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు...

Related Posts