YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పాక్, భారత్ సరిహద్దుల్లో ఉద్రిక‍్త పరిస్థితులు

పాక్, భారత్ సరిహద్దుల్లో  ఉద్రిక‍్త పరిస్థితులు
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:   
పాక్, భారత్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక‍్త పరిస్థితుల వల్ల దేశీ విమాన సర్వీసులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. పలు విమానయాన సంస్థలు ఇప్పటికే అనేక సర్వీసులను తాత్కాలికంగా రద్దుచేశాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌, గోఎయిర్‌, ఇండిగో, స్పైస్‌ జెట్‌ కంపెనీలు పలు సర్వీసులను నిలిపివేశాయి. జమ్మూ, శ్రీనగర్, అమృత్‌సర్‌, డెహ్రాడూన్, సిమ్లా, చండీగఢ్ సహా పలు ఇతర ప్రాంతాల్లో విమానాశ్రయాల మూసివేత కారణంగా తాత్కాలికంగా సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు సహనంతో వ్యవహరించాలని విజ్ఙప్తి చేశాయి.  విమానాశ్రయాలపై విధించిన నిబంధనలను ఎత్తివేసినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశముంది. దేశ రాజధానిలో అత్యున్నత సమావేశం జరిగింది. ఇందులో ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా పలు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం కేంద్రం విమానాశ్రయాల మూసివేత నిబంధలను ఎత్తివేసింది

Related Posts